10 కోట్లు రెమ్యునరేషన్ ఇవ్వలేదని.. రాజమౌళికి నో చెప్పిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్..!
Rajamouli: తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేసిన దర్శకుడు రాజమౌళి. రాజమౌళి అంటే కేవలం పేరు మాత్రమే కాదు.. అదొక బ్రాండ్.
హీరోని కాకుండా దర్శకుడు కూడా ఫాలోయింగ్ ఉందంటే మామూలు విషయం కాదు. ఆయన కేవలం స్టార్ హీరోలను పెట్టి సినిమాలు తీయడమే కాదు.. ఈగలను, దోమలను కూడా పెట్టి సినిమా తీసి.. కమర్షియల్ హిట్ కొట్టగల సత్తా రాజమౌళి సొంతం. ఆయన సినిమా ఇండస్ట్రీలో క్రియేట్ చేసిన రికార్డులు ఎన్నో. ఆయన సినిమాలో నటించాలని స్టార్ హీరోలు, హీరోయిన్స్ ఎంతగానో వేచి చూస్తారు. అలాంటిది ఓ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రాజమౌళి ఆఫర్ను రిజెక్ట్ చేసిందట. అది కూడా బాహుబలి సినిమాలో ప్రధాన పాత్రలో నటించే అవకాశం. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు? వివరాల్లోకెళ్తే..
దర్శకేంద్రుడు రాజమౌళి తెరకెక్కించిన సినిమా బాహుబలి. ఈ సినిమా తెలుగు చిత్ర పరిశ్రమ స్థాయిని విశ్వవ్యాప్తం చేసిందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అంతకుముందు ఉన్న ఇండస్ట్రీ రికార్డులన్నిటిని బ్రేక్ చేసి సరికొత్త రికార్డులను సృష్టించింది రాజమౌళి బాహుబలి. అలాంటి సినిమాలో శివగామి పాత్రలో నటించే ఛాన్స్ వస్తే ఓ హీరోయిన్ వద్దందట. అది కూడా ఆమె అడిగినంత రెమ్యూనరేషన్ ఇవ్వకపోవడంతో రిజెక్ట్ చేశారని టాక్. ఇంతకీ ఆ స్టార్ హీరోయిన్ ఎవరని అనుకుంటున్నారా.. ఆ హీరోయిన్ ఎవరో కాదు.. అతిలోక సుందరి శ్రీదేవి.

అలనాటి అందాల తార శ్రీదేవిని తొలుత బాహుబలి సినిమాలో ప్రధాన పాత్ర శివగామి రోల్ కోసం ఎన్నుకున్నారట. దీంతో రాజమౌళి.. శ్రీదేవిని కలిసారట. శివగామి పాత్ర గురించి చెప్పడంతో శ్రీదేవి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. అయితే.. ఈ పాత్ర కోసం శ్రీదేవి ఏకంగా 10 కోట్ల వరకు డిమాండ్ చేసిందట. అయితే ఫ్లైట్,హోటల్ ఖర్చులు ఇలా మొత్తం కలిపితే దాదాపు రూ. 15 కోట్ల వరకు అవుతుందనిమూవీ మేకర్స్ వెనకడగేసారట.ఇలా రెమ్యూనరేషన్ విషయంలో వీరి మధ్య తేడా వచ్చిందనీ, దీంతో ఆ పాత్రలో శ్రీదేవి నటించే అవకాశం కోల్పోయిందని అప్పట్లో టాక్ వచ్చింది.
ఆ తరువాత ఆ రోల్ కోసం అలనాటి గ్లామర్ హీరోయిన్ రమ్యకృష్ణ ను రాజమౌళి సంప్రదించారట. రమ్యకృష్ణ కి ఆ పాత్ర ఎంతగానో నచ్చడంతో వెంటనే ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట. ఆ తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. రాజమాత శివగామి పాత్రలో రమ్యకృష్ణ తన నట విశ్వరూపాన్ని చూపించింది. రమ్యకృష్ణ నటనపై విమర్శలు సైతం ప్రశంసలు కురిపించింది. ఆ పాత్రకు సరైన న్యాయం చేయలేకపోదని, ఆ పాత్రను శ్రీదేవి ఒప్పుకోప్పుకోవడమే చాలా మంచిదైందని రాజమౌళి కూడా చెప్పుకొచ్చాడు.
ఈ విషయంపై శ్రీదేవి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. పారితోషకం విషయంలో ఆ సినిమాను ఒప్పుకోకపోవడం అనేది నిజం కాదని, అలా అనుకుని ఉంటే 300 సినిమాలు చేసి ఉండే దాని కాదని, తాను ఆ పాత్రకు సెట్ కానని, బహుశా రాజమౌళి, ఆ నిర్మాతలకు అలా నా గురించి చెప్పి ఉండవచ్చని తెలిపింది. ఆ వార్తలు నిజం లేదని శ్రీదేవి క్లారిటీ ఇచ్చింది.

ఇదిలాఉంటే.. ప్రస్తుతం రాజమౌళి.. సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి ప్లాన్ వరల్డ్ మూవీని ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీని ఆఫ్రికా అడవులలో షూటింగ్ చేయనున్నట్లు సమాచారం. ఈ సినిమా కోసం మహేష్ బాబు తన లూక్ ను మార్చి వేశాడు. త్వరలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. రాజమౌళి కూడా ఈ సినిమా కోసం చాలా కష్టపడుతూ ఉన్నాడు. సినిమా లొకేషన్ లో కొరకు ఎడారుల్లో తిరిగిన ఫోటోలు వైరల్ అయిన విషయం తెలిసిందే. ఇందులో టాలీవుడ్ బాలీవుడ్ యాక్టర్స్ ఏ కాకుండా హాలీవుడ్ యాక్టర్స్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నారని సమాచారం. ఈ సినిమా ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తోంది వేచిచూడాలి.


Click it and Unblock the Notifications











