»   » బక్రీద్: బకరాలకు సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్ పేర్లు, భారీ డిమాండ్(ఫోటో)

బక్రీద్: బకరాలకు సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్ పేర్లు, భారీ డిమాండ్(ఫోటో)

By Bojja Kumar
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  న్యూఢిల్లీ: సినిమా స్టార్లు బకరాలయ్యారు. ఇందులో ఆశ్చర్య పడాల్సిన విషయం ఏమీ లేదు. తమ అభిమాన హీరోలపై అభిమానంతో వారి పేర్లను బకరా(మేక)లకు పెట్టారు అమ్మకం దారులు. బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకుని ఢిల్లీలో మేకలను మార్కెట్లో షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్ అనే పేర్లతో పాటు పలువురు స్టార్ల పేర్లతో ఉండే మేకలు దర్శనం ఇచ్చాయి.

  బక్రీద్ సందర్భంగా మేకలు అమ్మేవారు భారీగా అమ్మకాలు జరుపడంతో పాటు మంచి లాభాలు పొందారు. చూడటానికి అందంగా, బాగా బలిష్టంగా ఉండి కండ పట్టి ఉన్న మేకలకు బాలీవుడ్ స్టార్ల పేరు పెట్టారు అమ్మకం దారులు. స్టార్ హీరోల పేర్లతో ఉన్న ఆకర్షణీయమైన మేకలు రూ. 15,000 నుంచి రూ. 5 లక్షల వరకు అమ్ముడయ్యాయి.

  ఓ అమ్మకం దారుడు సినిమా స్టార్ల పేరుతో ఉన్న మేకలను భారీగా లాభాలు పొందాడు. 'నా వద్ద ఉన్న ఆరోగ్యవంతమైన బలమైన మేకకు సల్మాన్ ఖాన్ పేరు పెట్టాను. ఆ మేక రూ. 1,35,000 అమ్ముడు పోయింది' అని హర్షద్ హలాల్ మీట్ షాప్‌కు చెందిన చాంద్ వెల్లడించారు.

  బక్రీద్ సందర్భంగా అమ్మే మేకలకు ఇలా సినిమా స్టార్ల పేర్లు పెట్టడం అనే ఆనవాయితీ....పలు చోట్ల కొన్నేళ్లుగా సాగుతోంది. గత సంవత్సరం సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ల పేరుతో ఉన్న జంట మేకలు జామా మసీద్ వద్ద రూ. 4 లక్షలకు అమ్ముడయ్యాయి. బ్రకీద్ కోసం మేకలను ప్రత్యేకంగా పెంచుతారు. అమ్మకం సందర్భంగా వాటిని ప్రత్యేకంగా ముస్తాబు చేస్తారు.

  English summary
  We may have seen kids wanting to name their toys after Bollywood heroes, but what's unusual is to see goats being named after superstars. It's quite amusing to know that goat sellers in Delhi named their best goats after the top actors such as Shahrukh khan and Salman Khan.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more