For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Godfather Movie:గాడ్ ఫాదర్ చిత్రంలో చిరంజీవికి తండ్రిగా చేసిన ఈ హీరోను గుర్తుపట్టారా?

  |

  ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. తనదైన యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్ అన్నింటికీ మించి గ్రేస్‌తో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకుని.. అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా ఎదిగిపోయారు మెగాస్టార్ చిరంజీవి. అలా సుదీర్ఘ కాలం పాటు టాలీవుడ్‌లో హవాను చూపించిన ఆయన.. సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చి రెట్టించిన ఉత్సాహంతో సినిమాలు చేస్తున్నారు. అందులో ఒకటి 'గాడ్ ఫాదర్' మూవీ. ఈ మూవీ దసరా కానుకగా అక్టోబర్ 5న విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ టాక్ అందుకుంటుంది. సినిమా ఘన విజయం సాధించిన నేపథ్యంలో సక్సెస్ మీట్ కూడా నిర్వహించారు. అయితే ఈ గాడ్ ఫాదర్ మూవీలో చిరంజీవికి తండ్రిగా నటించింది ఒక హీరో. ఇప్పుడు ఆ హీరో ఎవరా.. అనే టాపిక్ ఆసక్తిని సంతరించుకుంది.

   ఆచార్య డిజాస్టర్ తర్వాత..

  ఆచార్య డిజాస్టర్ తర్వాత..

  మలయాళ సూపర్‌స్టార్ మోహన్ లాల్ నటించిన లూసిఫర్ మూవీ రీమేక్ గా మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం గాడ్ ఫాదర్. ఆచార్య మూవీ డిజాస్టర్ తర్వాత డైరెక్టర్ మోహన్ రాజా దర్శకత్వంలో వచ్చిన గాడ్ ఫాదర్ లో బ్రహ్మగా అదరగొట్టారు చిరంజీవి. ఈ మూవీలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటిస్తున్నట్లు వార్తలు రాగానే సినిమాపై అంచనాలు అమాంతం పెరిగాయి. అత్యంత భారీ అంచనాల మధ్య దసరా కానుకగా అక్టోబర్ 5న గ్రాండ్ గా విడుదలైంది గాడ్ ఫాదర్ మూవీ. విడుదల తొలి రోజు నుంచే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఇక మెగా అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. బాస్ ఈజ్ బ్యాక్ అంటూ థియేటర్ల వద్ద సందడి చేశారు చిరు అభిమానులు.

  అర్జున్ సర్జా, జగపతి బాబు కాంబినేషన్లో..

  అర్జున్ సర్జా, జగపతి బాబు కాంబినేషన్లో..

  తొలుత ఈ మూవీకి కోలీవుడ్ డైరెక్టర్ మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నారనగానే కొంతమేర ఆసక్తి నెలకొంది. ఎందుకంటే 21 ఏళ్ల క్రితం అర్జున్ సర్జా, జగపతి బాబు కాంబినేషన్లో హనుమాన్ జంక్షన్ చిత్రాన్ని తెరకెక్కించి హిట్ కొట్టారు. అంతేకాకుండా కోలీవుడ్ హీరో జయం రవి సోదరుడే ఈ మోహన్ రాజా. తర్వాత ఈ సినిమాలో నటిస్తున్న వివరాలు ఒక్కొక్కరిగా బయటపెట్టడంతో అంచనాలు మరింతగా పెరిగాయి. ఈ మూవీలో చిరంజీవికి సోదరిగా లేడి సూపర్ స్టార్ నయనతార, విలన్ గా సత్యదేవ్ నటిస్తున్నాడని తెలియగానే ఒక రకమైన క్రేజ్ ఏర్పడింది. ఇక బాలీవుడ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటిస్తున్నాడని, అది కూడా చిరంజీవిని కాపాడే మాఫియా డాన్ క్యారెక్టర్ లో అని వార్తలు రావడంతో అంచనాలు కాస్త ఆకాశాన్నంటాయి.

  ఒకప్పటి పాపులర్ హీరో..

  ఒకప్పటి పాపులర్ హీరో..


  అలాగే చిరంజీవి నటించిన ఈ గాడ్ ఫాదర్ చిత్రంలో మురళీ శర్మ, సునీల్, బిగ్ బాస్ ఫేమ్ దివి వాద్యాతోపాటు మరొక కీలక పాత్రలో ఒకప్పటి పాపులర్ హీరో నటించాడు. చిరంజీవికి తండ్రిగా నటించిన ఆ హీరోను చాలా మంది గుర్తించలేదనే చెప్పవచ్చు. ఆయన పేరు సర్వదమన్ బెనర్జీ. ఒకప్పుడు హీరోగా చేసి అనేక మంది ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు ఆయన. 1986 సంవత్సరంలో దిగ్గజ దర్శకుడు కె. విశ్వనాథ్ తెరకెక్కించిన సిరివెన్నెల మూవీ గుర్తుండే ఉంటుంది. ఈ చిత్రంలో సుహాసినితోపాటు సర్వదమన్ బెనర్జీ ప్రధాన పాత్రల్లో నటించారు. అప్పట్లో ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్. ఆల్ టైమ్ క్లాసిక్ గా నిలిచిన ఈ సినిమాలోని పాటలకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది.

  చాలా మందికి హాట్ ఫేవరెట్..

  చాలా మందికి హాట్ ఫేవరెట్..

  ఈ సిరివెన్నెల చిత్రంలోని పాటలు ఇప్పటికీ చాలా మందికి హాట్ ఫేవరెట్ గా ఉన్నాయని చెప్పవచ్చు. ఆ సినిమానే కాకుండా ఎన్నో చిత్రాల్లో నటించిన ఆయన అకస్మాత్తుగా సినీ ఇండస్ట్రీకి దూరమయ్యారు. ఇప్పుడు సుమారు 35 సంవత్సరాల తర్వాత మళ్లీ మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ మూవీలో రీ ఎంట్రీ ఇవ్వడం విశేషం. దీంతో ఆయన గురించి తెలిసిన వారు ఒకరకంగా ఆశ్చర్యపోతున్నారు. ఇదిలా ఉంటే చిరంజీవి బ్రహ్మాగా నటించిన గాడ్ ఫాదర్ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. విడుదలైన 4 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు గాడ్ ఫాదర్ మూవీకి రూ. 42.43 కోట్లు షేర్‌ రాగా, రూ. 77.20 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

  English summary
  Interesting Details About Sarvadaman Banerjee Who Has Played Father Role To Chiranjeevi In Godfather Movie.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X