‘ఈగ’కు ‘మగధీర’కు తేడా అక్కడే

By Srikanya

'మగధీర' అప్పుడు స్పాట్‌లో నటీనటులు ఉంటారు. బ్యాగ్రౌండ్ ఉండదు. అయితే బ్యాగ్రౌండ్‌ని ఊహించుకుని అందుకు తగ్గట్గుగా కెమెరాని సెట్ చేస్తాం. ఆ తర్వాత సీజీలో బ్యాగ్రౌండ్‌ని సృష్టిస్తారు. ఇక 'ఈగ' సినిమా ప్రధానంగా ఈగ చుట్టూ తిరుగుతుంది. కానీ లొకేషన్‌లో ఈగ ఉండదు. ఉన్నట్లుగా ఊహించుకుని కెమెరా సెట్ చేస్తాం. నటీనటులు కూడా అక్కడ ఈగ ఉన్నట్లుగానే ఊహించుకుని, నటించాలి. మేమంతా ఊహతో చేసిన ఈ సన్నివేశాలకు కంప్యూటర్ గ్రాఫిక్స్‌తో ఈగని సృష్టిస్తారు" అంటూ తేడా వివరించారు కెమెరామెన్ సెంధిల్ కుమార్. ఆయన తాజాగా వర్క్ చేసిన 'ఈగ'సంచలన విజయం సాధించిన నేపధ్యంలో స్పందించారు.

"ఇప్పటివరకు నేను చేసిన అన్ని చిత్రాల్లో కల్లా 'ఈగ' చాలా కష్టమైన సినిమా. రాజమౌళితో చేసిన చిత్రాల్లో 'మగధీర'లో ఎక్కువ సీజీ (కంప్యూటర్ గ్రాఫిక్స్) ఉన్నాయి. ఈ సినిమాలో ఇంకా ఎక్కువ. అయితే 'మగధీర'లో బ్యాక్‌గ్రౌండ్ లొకేషన్స్‌కి మాత్రమే సీజీ వర్క్ ఉంటుంది. కానీ ఈ చిత్రంలో ఒక మెయిన్ కేరక్టరే (ఈగ) సీజీకి సంబంధించినది. సీన్స్ తీస్తున్నప్పుడు అక్కడ నిజంగానే ఈగ ఉన్నట్లుగా ఊహించి నేను షాట్స్ తీయాల్సి ఉంటుంది. దీనికోసం కొన్ని రకాల పరిమాణాల్లో నకిలీ ఈగలను తయారు చేశాం. ఈగ క్లోజప్‌లో కనిపిస్తే ఎలా ఉంటుంది? లాంగ్ షాట్‌లో ఎలా అగుపిస్తుంది? అని ఆ నకిలీ ఈగల ఆధారంగా ఊహించుకుని తీయడం జరిగింది. ఇది ఒకింత కష్టంతో కూడుకున్న పనే" అని చెప్పారు.

"అలాగే...'ఈగ' ను సృష్టించడానికి ఏయే కెమెరాలు వాడారో చెప్తూ... యారీ 435 ఎక్స్‌ట్రీమ్, 5డి, 7డి, ఫాంథమ్, వైస్‌కామ్, గోప్రో, రెడ్ ఎపిక్ కెమెరాలు వాడాం. సినిమా మొత్తం 'ప్రోబ్ లెన్స్' వాడాం. అక్కడక్కడా మాస్టర్ ప్రైమ్ లెన్స్ వాడటం జరిగింది అన్నారు. అలాగే ఈ సినిమా నాకో సవాల్ అనే చెప్పాలి. ఇప్పటివరకు చేసిన అన్ని చిత్రాల్లోకల్లా ఇది డిఫరెంట్ మూవీ. ఈగ మెయిన్ కేరక్టర్ కాబట్టి ముందు ఈగతో ఫొటోషూట్ చేశాం. ఈగను కాసేపు ఫ్రిడ్జ్‌లో పెడితే స్పృహ కోల్పోతుంది. అప్పుడు ఈ ఫొటోషూట్ చేయడం జరిగింది. ఆ తర్వాత చిన్నపాటి వీడియో చిత్రీకరించాం. ఇలా ఈ చిత్రం కోసం చాలా వర్కవుట్ చేశాం" అన్నారు.

ఇక రాజమౌళితో పనిచేయటం గురించి చెపుతూ...."రాజమౌళి ప్రతి సినిమా ఒక ప్రయోగం. 'యమదొంగ' హిట్ తర్వాత అంతకన్నా బాగా ఏదైనా చెయ్యాలనుకున్నాం. 'మగధీర'లాంటి ప్రయోగం చేశాం. ఈ సినిమాతో నాకు భారతదేశం మొత్తం గుర్తింపు వచ్చింది. ఈ చిత్రంతో మేం ఒక స్టెప్ ఎదిగాం. ఇప్పుడు 'ఈగ'తో ఇంకా ఎదిగాం. తెలుగు సినిమా స్థాయిని పెంచారు రాజమౌళి. అందులో ఏమాత్రం సందేహం లేదు. అందుకే రాజమౌళితో సినిమా చేయడం నాకు ఆనందంగా ఉంటుంది" అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X