పూరి జగన్నాథ్, ఆర్జీవీ మధ్య చిచ్చు.. పవన్ కళ్యాణ్ కోసమేనా.. వర్మ రియాక్షన్!

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, వివాదాస్పద దర్శకుడు వర్మకు చెడిందా.. టాలీవుడ్ లో ఈ వార్త హాట్ టాపిక్ గా మారింది. ఈ మేరకు ఓ ఆంగ్ల పత్రికలో వచ్చిన కథనం ఆసక్తి రేపుతోంది. పూరి జగన్నాథ్ వాస్తవానికి వర్మ శిష్యుడు. వీరిద్దరూ చాలా సన్నిహితంగా ఉంటారు. వర్మ హైదరాబాద్ కు వచ్చిన ప్రతి సారి పూరి నివాసానికి వెళతారు. రాంగోపాల్ వర్మ ప్రస్తుతం భైరవగీత చిత్రం కోసం హైదరాబాద్ లోనే ఉన్నారు. కానీ పూరి జగన్నాథ్ ని కనీసం కలవలేదని వార్తలు వస్తున్నాయి. వీరిద్దరి మధ్య చిచ్చుపెట్టిన అంశాల ఏంటో ఇప్పుడు చూద్దాం.

భైరవగీత

భైరవగీత

రాంగోపాల్ వర్మ సిద్దూ అనే కొత్త దర్శకుడిని పరిచయం చేస్తూ నిర్మించిన చిత్రం భైరవ గీత. రాయలసీమ ఫ్యాక్షన్, ఎమోషనల్ ప్రేమ కథతో తెరకెక్కుతున్న యువతని ఆకర్షిస్తోంది. త్వరలో విడుదలకు సిద్ధం అవుతున్న ఈ చిత్రం కోసం రాంగోపాల్ వర్మ తనదైన శైలిలో భారీ ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. వివాదాలతో తన చిత్రాలకు ప్రచారం కల్పించుకోవడంలో రాంగోపాల్ వర్మ దిట్ట.

 ఇద్దరి మధ్య చిచ్చు

ఇద్దరి మధ్య చిచ్చు

వర్మ హైదరాబాద్ వచ్చిన ప్రతిసారి పూరి జగన్నాథ్‌ని అంటిపెట్టుకుని ఉంటారు. కానీ భైరవగీత ప్రచారంలో, ప్రీరిలీజ్ ఈవెంట్లో ఎక్కడా పూరి జగన్నాథ్ కనిపించలేదు. కొన్ని నెలల క్రితం టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ వ్యవహారం పెద్ద ఎత్తున దుమారం రేపింది. కాస్టింగ్ కౌచ్ విషయంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని అనవసరంగా లాగి మీడియా సంస్థల్లో డిబేట్లు జరిగాయి. ఈ మొత్తం వ్యవహారంలో ఆర్జీవీ ప్రమేయం ఉందని తెలియడంతో పూరిజగన్నాథ్ అతడిని దూరం పెట్టినట్లు తెలుస్తోంది.

పవన్ కళ్యాణ్ కోసం

పవన్ కళ్యాణ్ కోసం

కాస్టింగ్ కౌచ్ ఉద్యమాన్ని తెరమీదికి తీసుకువచ్చిన శ్రీరెడ్డి దారుణమైన పదజాలంతో పవన్ కళ్యాణ్‌ని దూషించింది. ఈ ఘటన జరిగిన తరువాత నేనే పవన్ కళ్యాణ్ ని తిట్టమని చెప్పానని ఆర్జీవీ తెలిపారు. పవన్ కళ్యాణ్ అభిమానులు, సినీ ప్రముఖులు వరుసగా వర్మని దుమ్మెత్తి పోశారు. అందులో పూరీ జగన్నాథ్ కూడా ఉన్నారు. నా సినీజీవితానికి కారణమైన పవన్ కళ్యాణ్ గారు భాదపడడం నేనెప్పుడూ చూడలేదు. మీరు చేసిన పని నాకు నచ్చలేదు ఆర్జీవీ అంటూ పూరి ట్విట్టర్ లో స్పందించారు. అప్పటి నుంచి వీరి మధ్య మాటల్లేవని వార్తలు వస్తున్నాయి.

వర్మ రియాక్షన్

వర్మ రియాక్షన్

తనకు, పూరి జగన్నాథ్ కు మధ్య మాటల్లేవు అంటూ సదరు ఆంగ్ల పత్రికలో వచ్చిన కథనంపై రాంగోపాల్ వర్మ స్పందించారు. ఇది అబద్దపు వార్త అంటూ వర్మ ట్వీట్ చేశారు. తాను, పూరి జగన్నాథ్ ఎప్పటికి మంచి స్నేహితులమే అని రాంగోపాల్ వర్మ పేర్కొన్నాడు. ఇదిలా ఉండగా వర్మ మరో వివాదాస్పద చిత్రం లక్ష్మీస్ ఎన్టీఆర్ ని కూడా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X