Don't Miss!
- News ఈ ఒక్కటి ఇంట్లో ఉంటే డబ్బు ఆటోమేటిక్ గా వస్తుంది
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్‌తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్‌నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్‌బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
తప్పు సమంతదా? బెల్లంకొండదా?
ఆవిడ ప్రొఫెషనల్ బిహేవియర్ బాగోలేదంటూ నిర్మాత బెల్లకొండ సురేష్.. హీరోయిన్ సమంతపై మూవీ ఆర్టిస్ట్ అసోసియేస్లో ఫిర్యాదు చేయడం ఫిల్మ్ నగర్ లో చర్చనీయాంశం అయింది. తన వద్ద అడ్వాన్ తీసుకుని డేట్లు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతోందని బెల్లకొండ ఆరోపిస్తున్నప్పటికీ...అసలు వాస్తవాలేమిటి? ఈ వ్యవహారంలో తప్పు ఎవరిది? డబ్బు తీసుకుని సమంత అలా ఎందుకు చేసింది? అనే వివరాలు ఆరా తీస్తే ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి.
నిర్మాత బెల్లంకొండ సురేష్ నందినీరెడ్డి దర్శకత్వంలో సిద్ధార్థ్, సమంత జంటగా ఓ సినిమా తీయాలని నాలుగైదు నెలల క్రితం డిసైడ్ అయ్యారు. అప్పటికే సమంత బిజీ హీరోయిన్ గా ఉండటంతో ఆమె ఎక్కడ తన చేజారి పోతోందో అనే అనుమానంతో వెంటనే అడ్వాన్ ఇచ్చేశాడు బెల్లంకొండ. బెల్లకొండ త్వరగా సినిమా షెడ్యూల్ ఖరారు చేస్తే డేట్స్ ఇచ్చేసి, మిగతా సినిమాను ఒప్పుకుందామనే ఆలోచన చేసింది సమంత. అయితే బెల్లకొండ సినిమాకు సంబంధించిన షెడ్యూల్ ఎంతకీ ఖరారు చేయడంతో ఇతర సినిమాలకు కమిట్ అయింది సమంత.
వేరే సినిమాలకు డేట్స్ ఇచ్చాక బెల్లకొండ వచ్చి తనకు డేట్స్ ఇవ్వమని పట్టుబట్టడంతో....ఈ సినిమాలు పూర్తయ్యాక ఇస్తానని సమంత చెప్పినట్లు సమాచారం. అయితే బెల్లకొండ వినక పోవడంతో పట్టించుకోవడం మానేసింది. దీంతో చిర్రెత్తిన బెలంకొండ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో ఫిర్యాదు చేశాడు. అదన్నమాట సంగతి.