twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తప్పు సమంతదా? బెల్లంకొండదా?

    By Bojja Kumar
    |

    ఆవిడ ప్రొఫెషనల్ బిహేవియర్ బాగోలేదంటూ నిర్మాత బెల్లకొండ సురేష్.. హీరోయిన్ సమంతపై మూవీ ఆర్టిస్ట్ అసోసియేస్‌లో ఫిర్యాదు చేయడం ఫిల్మ్ నగర్ లో చర్చనీయాంశం అయింది. తన వద్ద అడ్వాన్ తీసుకుని డేట్లు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతోందని బెల్లకొండ ఆరోపిస్తున్నప్పటికీ...అసలు వాస్తవాలేమిటి? ఈ వ్యవహారంలో తప్పు ఎవరిది? డబ్బు తీసుకుని సమంత అలా ఎందుకు చేసింది? అనే వివరాలు ఆరా తీస్తే ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి.

    నిర్మాత బెల్లంకొండ సురేష్ నందినీరెడ్డి దర్శకత్వంలో సిద్ధార్థ్, సమంత జంటగా ఓ సినిమా తీయాలని నాలుగైదు నెలల క్రితం డిసైడ్ అయ్యారు. అప్పటికే సమంత బిజీ హీరోయిన్ గా ఉండటంతో ఆమె ఎక్కడ తన చేజారి పోతోందో అనే అనుమానంతో వెంటనే అడ్వాన్ ఇచ్చేశాడు బెల్లంకొండ. బెల్లకొండ త్వరగా సినిమా షెడ్యూల్ ఖరారు చేస్తే డేట్స్ ఇచ్చేసి, మిగతా సినిమాను ఒప్పుకుందామనే ఆలోచన చేసింది సమంత. అయితే బెల్లకొండ సినిమాకు సంబంధించిన షెడ్యూల్ ఎంతకీ ఖరారు చేయడంతో ఇతర సినిమాలకు కమిట్ అయింది సమంత.

    వేరే సినిమాలకు డేట్స్ ఇచ్చాక బెల్లకొండ వచ్చి తనకు డేట్స్ ఇవ్వమని పట్టుబట్టడంతో....ఈ సినిమాలు పూర్తయ్యాక ఇస్తానని సమంత చెప్పినట్లు సమాచారం. అయితే బెల్లకొండ వినక పోవడంతో పట్టించుకోవడం మానేసింది. దీంతో చిర్రెత్తిన బెలంకొండ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో ఫిర్యాదు చేశాడు. అదన్నమాట సంగతి.

    English summary
    buzz is that there was a long delay from Bellamkonda’s side and Samantha had to give her dates to other projects. Now, it is heard that Bellamkonda is ready to commence the film but Samantha has no dates. While the talk is that Bellamkonda has filed a complaint, there are those who say Samantha is right on her stand.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X