వెంకీతో విభేదాలు నిజమే.. అఖిల్ సూపర్ పంచ్!

By Rajababu

Recommended Video

Akhil Akkineni Gives Clarity On Venky Atluri Issue

సినిమా పరిశ్రమలో నిప్పు లేకుండా పొగపుట్టడం చాలా సహజమైన విషయం. ఒకవేళ అలాంటి వార్తలపై వివరణ ఇవ్వకపోతే దానిని గోరంతలు కొండంతలు చేస్తారు. మసిపూసి మారెడు కాయను ఏదో చేసేస్తారనే విధంగా కథనాలు వెలువడుతాయి. తాజాగా టాలీవుడ్‌లో దర్శకుడు వెంకీ అట్లూరి, హీరో అఖిల్ మధ్య విభేదాలు అంటూ మీడియాలో ఓ వార్త హల్‌చల్ చేసింది. అందుకు సమాధానంగా వారిద్దరు కలిసి ఓ ఫన్నీ వీడియోను రిలీజ్ చేశారు.

వెంకీతో అఖిల్‌కు విభేదాలని..

వెంకీతో అఖిల్‌కు విభేదాలని..

తొలిప్రేమ తర్వాత అఖిల్‌తో వెంకీ అట్లూరి జతకట్టారు. తన మూడో చిత్రానికి సంబంధించిన స్క్రిప్టులో వెంకీ చేస్తున్న మార్పులు అఖిల్‌కు న‌చ్చ‌డంలేద‌ని, అందుకే అఖిల్ రెండ్రోజులు షూటింగ్‌కు రాలేద‌ని వార్తలు షికారు చేశాయి. ఈ ఇద్ద‌రి మ‌ధ్య క్రియేటివ్ క్లాషెస్ కార‌ణంగా సినిమా ఆగిపోయే ప్ర‌మాదంలో ప‌డింద‌నేది ఆ వార్తల సారాంశం.

అఖిల్, వెంకీ వాగ్వాదం

అఖిల్, వెంకీ వాగ్వాదం

తమ క్రియేటివ్ డిఫెరెన్స్ పై వస్తున్న వార్తలపై వారిద్దరూ స్పందించారు. సోషల్ మీడియాలో వైరల్‌గా వీడియోలో.. నువ్వే చెప్పు అంటే నువ్వే చెప్పు అని గొడవపడినట్టు నటించారు. నువ్వే మాట్లాడంటూ ఒకరికొకరు వాదులాడుకొన్నారు. మీరు హీరో ముందు మీరే మాట్లాడంటూ వెంకీ అట్లూరి సూచించారు.

అఖిల్‌పై వెంకీ సెటైర్

అఖిల్‌పై వెంకీ సెటైర్

అఖిల్ మాట్లాడుతూ.. వెంకీకి నాకు క్రియేటివ్ డిఫరెన్సెసెస్ ఉన్నాయంటూ వార్తలు వచ్చాయి. ఆయన డైరెక్టర్ కాబట్టి ఆయన ఏది చెబితే అది నేను చేయాలి అని అఖిల్ అనగానే.. అబ్బా ఛా అని వెంకీ ఓ ఎక్స్‌ప్రెషన్ ఇచ్చాడు.

వెంకీకి అఖిల్ ముద్దు

ఆ తర్వాత అఖిల్ మాట్లాడుతూ వెంకీకి మధ్య గొడవలు వచ్చాయన్నది నిజమే. అది కరెక్ట్ న్యూస్ చెప్పి వీడియోను పోస్టు చేస్తున్నాను అని ఆ వార్తను ఎద్దేవా చేసే విధంగా అన్నారు. ఆ తర్వాత ఒకరి ముఖం ఒకరు చూసుకొని బిగ్గరగా నవ్వుకొన్నారు. ఆ తర్వాత వెంకీని ముద్దుపెట్టుకొని అక్కడి నుంచి అఖిల్ పారిపోయారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X