twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘దిక్కులు చూడకు రామయ్య’ ఆడియో (ఫోటోస్)

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: రాజమౌళి శిష్యుడు త్రికోటిని దర్శకుడిగా పరిచయం చేస్తూ సాయి శివాని సమర్పణలో రజని కొర్రపాటి నిర్మించిన చిత్రం 'దిక్కులు చూడకు రామయ్య'. ఈ చిత్రంలో అజయ్, ఇంద్రజ, నాగశౌర్య, సనా మక్బుల్ ప్రధాన తారాగణంగా తెరకెక్కుతున్న ఈచిత్రం ఆడియో వేడుక శుక్రవారం జరిగింది. ఈ చిత్రానికి యం.యం. కీరవాణి పాటలు స్వరపరిచారు.

    ఈ ఆడియో వేడుకకు నాగార్జున, బోయాపటి శ్రీను ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. నాగార్జున ఆడియో సీడీలను ఆవిష్కరించి బోయపాటికి అందజేసారు. స్లైడ్ షోలో ఆడియో వేడుకకు సంబంధించిన వివరాలు, ఫోటోలు...

    నాగార్జున మాట్లాడుతూ..

    నాగార్జున మాట్లాడుతూ..


    నాగార్జున మాట్లాడుతూ.. 'రాజన్న సినిమా నుండే కోటి పరిచయం. అందులో ఒక సాంగ్ రాజమౌళి చేసి మిగతాదంతా కోటికే అప్పగించారు. ఆయన డైరెక్షన్ చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. ఈ సినిమా హిట్టయితో ఆయతో సినిమా తీస్తాను. సాయిగారు కథను నమ్మే నిర్మాత కాబట్టే ఈగ, లెజెండ్ లాంటి హిట్లు తన ఖాతాలో వేసుకున్నారు. క్రిమినల్'లో నేను చేసిన 'తెలుసా మనసా ...' తరహాలో ఈ చిత్రంలో ఓ పాట ఉంది. 'తెలుసా మనసా..'కన్నా ఈ పాట ఇంకా బాగుంది. కీరవాణిగారి మ్యూజిక్ అద్భుతం. ఈ సినిమా హిట్టవుతుందనే నమ్మకం ఉంది' అని చెప్పారు నాగార్జున.

    రాజమౌళి

    రాజమౌళి


    రాజమౌళి మాట్లాడుతూ ''నేను, కోటి ఇ్దదరం దర్శకుడు క్రాంతిగారి దగ్గర పని చేశాం. నేను జూనియర్ని, కోటి సీనియర్. ఆయనకు ఐదారు సార్లు డైరక్షన్ చాన్స్ వచ్చినట్లే వచ్చి చేజారింది. చివరికి కొర్రపాటి సాయిగారు అవకాశం ఇచ్చారు. ఈగ, విక్రమార్కుడు చిత్రాలకు నాతో వర్క్ చేశారు. ఆయనకు సినిమాలంటే పిచ్చి. చేతిలో డబ్బులుంటే తిండికంటే ముందు సినిమాలు చూడటానికే ప్రాధాన్యత ఇచ్చేరకం. లైఫ్ లో చాలా జిటివ్ యాటిట్యూడ్ ఉన్న వ్యక్తి. ఆయన నా దగ్గర నుండి వెళ్లి పోవడం నాకు ఒక చేయి పోయినట్లు ఉంది'' అన్నారు.

    బోయపాటి శ్రీను మాట్లాడుతూ..

    బోయపాటి శ్రీను మాట్లాడుతూ..


    రాజమౌళి, త్రికోటి మధ్య మంచి బంధం ఉంది. త్రికోటిగారు నాకు బాగా పరిచయమే. కానీ ఇద్దరం ఎప్పుడూ కలిసి పని చేయలేదు. ఆయనలో మంచి డైరెక్టర్ అయ్యే సత్తా ఉంది. ఆయన సినిమాకు కీరవాణిగారు మ్యూజిక్ ఇవ్వడం పెద్ద ప్లస్ పాయింట్.

    త్రికోటి మాట్లాడుతూ..

    త్రికోటి మాట్లాడుతూ..


    ''రాజమౌళిగారు లేకపోతే నేను లేను. ఆయన కుటుంబం నన్ను ఆదుకుంది. నా తొలి చిత్రానికి సాయి కొర్రపాటిగారు నిర్మాత కావడం నా అదృష్టం. అది కూడా రాజమౌళిగారి చలవే. ఈ చిత్రానికి మంచి టెక్నీషియన్లను ఇచ్చారు. సాయిగారికి, రాజమౌళిగారికి జీవితాంతం ఋణపడి ఉంటాను'' అని చెప్పారు.

    English summary
    Telugu Movie Dikkulu Choodaku Ramayya Audio Launch event held at JRC Convention Center, Hyderabad. Nagarjuna, Rajamouli, Boyapati Srinu and others graced the event.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X