'దిక్కులు చూడకు రామయ్య' సెన్సార్ పూర్తి...

By Bojja Kumar

హైదరాబాద్: సాయి శివాని సమర్పణలో వారాహి చలనచిత్ర పతాకంపై రజని కొర్రపాటి నిర్మించిన చిత్రం 'దిక్కులు చూడకు రామయ్య'. ఈ చిత్రంలో అజయ్, ఇంద్రజ ఓ జంటగా, నాగశౌర్య, సనా మక్బుల్ మరో జంటగా నటించారు. రాజమౌళి శిష్యుడు త్రికోటి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి యం.యం. కీరవాణి పాటలు స్వరపరిచారు.

Dikkulu Choodaku Ramayya gets U/A certificate

ఇటీవల విడుదలైన ఈ చిత్రం ఆడియోకి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. కాగా.. ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సెన్సార్ బోర్డ్ ఈ చిత్రానికి యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చిందని నిర్మాత సాయి కొర్రపాటి తెలిపారు. ఈ నెల 10న అత్యధిక థియేటర్లలో చిత్రాన్ని విడుదల చేయనున్నామని ఆయన చెప్పారు.

అచ్చ తెలుగు టైటిల్ తో రూపొందిన ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ఓ వినూత్న కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందించారు. దాదాపు పధ్నాలుగేళ్ల విరామం తర్వాత తెలుగులో ఇంద్రజ నటించిన చిత్రం ఇది. తెలుగులో సెకండ్ ఇన్నింగ్స్ కి ఇది మంచి చిత్రం అవుతుందని ఇంద్రజ తెలిపారు. ఇక, అజయ్, నాగశౌర్య కూడా ఈ చిత్రవిజయంపై పూర్తి నమ్మకంతో ఉన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X