రాజమౌళి చేతుల మీదుగా కొత్త చిత్రం లాంచ్(ఫోటోలు)

By Srikanya

హైదరాబాద్ : రాజమౌళి మరో శిష్యుడు దర్శకుడుగా తన ప్రతిభను నిరూపించుకోవటానికి సిద్దమవుతున్నారు. నెగిటివ్ పాత్రలు పోషించే అజయ్ హీరోగా ఈ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రానికి 'దిక్కులు చూడకు రామయ్య' అనే టైటిల్ ని పెట్టారు. త్రికోఠి దర్శకత్వం వహిస్తున్నారు. వారాహి చలన చిత్రం సంస్థ తెరకెక్కిస్తోంది. రజని కొర్రపాటి నిర్మాత.

అజయ్‌, శౌర్య, ఇంద్రజ, సనాఖాన్‌ కీలక పాత్రలు పోషిస్తున్న చిత్రం 'దిక్కులు చూడకు రామయ్య'. ఉగాది రోజున ఈ చిత్రం హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభమైంది. తొలి సన్నివేశానికి ఎమ్‌.ఎమ్‌.కీరవాణి క్లాప్‌నిచ్చారు. ఎస్‌.ఎస్‌.రాజమౌళి స్విచ్చాన్‌ చేశారు. ఆయనే గౌరవ దర్శకత్వం వహించారు.

నిర్మాత మాట్లాడుతూ... ''వినోదాత్మక ప్రేమకథ ఇది. త్రికోఠి చెప్పిన కథ కొత్తగా ఉంది. మా సంస్థ నుంచి వచ్చిన హిట్‌ చిత్రాల జాబితాలో ఈ చిత్రం కూడా నిలుస్తుంది'' అన్నారు. త్వరలోనే చిత్రీకరణ ప్రారంభించనున్నారు.

ఫోటోలతో కూడిన విశేషాలు...స్లైడ్ షోలో..

స్విఛ్చాన్ చేస్తూ...

స్విఛ్చాన్ చేస్తూ...


రాజమౌళి తన శిష్యుడు సినిమా ప్రారంభం కావటంతో చాలా ఉత్సాహంగా ఈ వేడుకలో పాల్గొని కెమెరా స్విఛ్చాన్ చేసారు.

కీరవాణి క్లాఫ్...

కీరవాణి క్లాఫ్...

తమకు చాలా కాలంగా పరిచయమున్న కోటి దర్శకుడు కావటంతో కీరవాణి ఈ కార్యక్రమానికి హాజరయ్యి క్లాప్ కొట్టి శుభాకాంక్షలు తెలియచేసారు.

హీరోగా మూడో సారి

హీరోగా మూడో సారి


అజయ్ ఆ ఒక్కడే చిత్రంతో హీరోగా పరిచయమయ్యారు. అయితే ఆ చిత్రం భాక్సాఫీస్ వద్ద విజయం సాధించలేదు. తర్వాత సారాయి వీర్రాజు చిత్రంతో మరోసారి హీరోగా పలకరిస్తే అదీ వర్కవుట్ కాలేదు. అయితే ఈ చిత్రం ఖచ్చితంగా ఘన విజయం సాధిస్తుందనే నమ్మకంతో ఉన్నారు.

రాజమౌళి అండతోనే...

రాజమౌళి అండతోనే...


రాజమౌళి మొదటి నుంచీ అజయ్ ని నటుడుగా ప్రోత్సహిస్తూ వస్తున్నారు. ఇప్పుడు ఈ చిత్రం ప్రారంభమవ్వటానికి కూడా రాజమౌళి అండదండలే కారణమంటున్నారు.

హీరోయిన్స్...

హీరోయిన్స్...

ఈ చిత్రంలో అజయ్ పాత్ర చాలా డిఫెరెంట్ గా ఉంటుందని చెప్తున్నారు. అతను సరసన ముగ్గురు హీరోయిన్స్ చేస్తున్నారు.

కుటుంబం

కుటుంబం


రాజమౌళి కుటుంబ సభ్యుడు లాంటి కోటి దర్శకుడు కావటంతో, రాజమౌళి కుటుంబం, కీరవాణి కుటుంబం కూడా ఈ వేడుకకు హాజరయ్యాయి

నిర్మాత..

నిర్మాత..


ఈగ చిత్రంతో సక్సెస్ ఫుల్ నిర్మాతగా, అందాల రాక్షసి చిత్రంతో ఉత్తమాభిరుచిగల నిర్మాతగా విశేషమైన గుర్తింపు తెచ్చుకున్న సాయి కొర్రపాటి ఈ చిత్రం నిర్మాత కావటంతో ప్రాజెక్టుపై అప్పుడే అంచనాలు మొదలయ్యాయి.

లెజండ్ సక్సెస్ తో....

లెజండ్ సక్సెస్ తో....


ఇదే బ్యానర్ నుంచి విడుదలైన బాలకృష్ణ లెజండ్ చిత్రం ఘన విజయం సాధించిన నేపధ్యంలో ఈ చిత్రం ప్రారంభించారు. ఈ చిత్రంలోనూ అన్ని కమర్షియల్ విలువలూ ఉన్నాయని చెప్తున్నారు.

నటీనటులు..

నటీనటులు..

నాగినీడు, అలీ, విశాల్‌, రమేష్‌, హరితేజ, వేణు తదితరులు నటిస్తున్నారు. అజయ్‌, శౌర్య, ఇంద్రజ, సనాఖాన్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఎవరెవరు

ఎవరెవరు


మాటలు: రమేష్‌ - గోపి, కూర్పు: తమ్మిరాజు, ఛాయాగ్రహణం: బి.వి.అమరనాథ్‌రెడ్డి, ప్రొడక్షన్‌ డిజైనర్‌: రవీందర్‌, సంగీతం: కీరవాణి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X