కుర్రాడిని రాజమౌళి పొగిడాడు
హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు రాజమౌళి టాలెంట్ ఎక్కడ ఉన్నా దాన్ని గుర్తించి మెచ్చుకోవటంలో ముందుంటాడని అంటూంటారు. తాజాగా ఆయన యువ హీరో నాగ శౌర్యని పొగడ్తల్లో ముంచెత్తుతున్నారు. దిక్కులు చూడకు రామయ్య చిత్రం చూసానని అందులే చేసిన హీరో కి మంచి ప్యూచర్ ఉంటుందని అంటున్నారు.
రాజమౌళి ట్వీట్ చేస్తూ.... "శౌర్య నటన నాకు చాలా నచ్చింది. తనకు మంచి భవిష్యత్తు వుందని" అన్నారు. రాజమౌళి మిత్రుడు సాయి కొర్రపాటి నిర్మాణంలో మొన్న శుక్రవారం విడుదలైన దిక్కులు చూడకు రామయ్య సినిమా ద్వారా శౌర్య మరోసారి మనల్ని పలకరించాడు. ఇంతకు ముందు సైతం నాగశౌర్య ఇదే బ్యానర్ లో ఊహలు గుసగుసలాడే చిత్రం చేసిన విషయం తెలిసిందే.

నాగశౌర్య, అజయ్, సనా, ఇంద్రజ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'దిక్కులు చూడకు రామయ్య'. త్రికోటి దర్శకత్వం వహించారు. వారాహి చలన చిత్రం పతాకంపై రజని కొర్రపాటి నిర్మించారు. ఈ నెల 10న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.
''తెలుగుదనం ఉట్టిపడే ప్రేమకథతో రూపొందిన చిత్రమిది. ఇంటిల్లిపాదిని అలరించేలా ఉంది. ఎం.ఎం.కీరవాణి స్వరాలందించిన పాటలకు మంచి స్పందన వస్తోంది. సినిమాకూ ఇదే స్థాయిలో స్పందన వస్తోంది''అన్నారు చిత్ర సమర్పకుడు సాయి కొర్రపాటి.


Click it and Unblock the Notifications











