నేను ఎప్పటికీ గర్ల్‌ఫ్రెండ్ కాదు.. సుశాంత్‌ సింగ్‌తో ప్రియురాలు కఠినంగా

బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత రిలీజ్ కాబోతున్న దిల్ బేచారా సినిమా ట్రైలర్‌ను జూలై 6వ తేదీన విడుదల చేశారు. ఈ చిత్రంలో సుశాంత్‌కు హీరోయిన్‌గా సంజనా సంఘీ నటించారు. గతంలో పలు సినిమాలకు క్యాస్టింగ్ డైరెక్టర్‌గా వ్యవహరించిన సుశాంత్ స్నేహితుడు ముఖేష్ చాబ్రా దర్శకుడిగా మారి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమా ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందించారు. ఈ చిత్రం నేరుగా జూలై 24 డిస్నీ+ హాట్‌స్టార్‌పై రిలీజ్ కాబోతున్నది. ఈ క్రమంలో విడుదల చేసిన ట్రైలర్ ఎలా ఉందంటే..

ప్రముఖ రచయిత రాసిన పుస్తకం

ప్రముఖ రచయిత రాసిన పుస్తకం

దిల్ బేచారా సినిమా ప్రముఖ రచయిత జాన్ గ్రీన్ రాసిన ది ఫాల్ట్ ఇన్ అవర్ స్టార్స్ అనే పుస్తకం ఆధారంగా తెరకెక్కింది. కైజీ, మన్నీ అనే ఇద్దరు సాధారణ యువతీ, యువకుల మధ్య చోటుచేసుకొన్న ఎక్ట్రార్డినరీ ప్రేమకథగా రూపొందుతున్నది. వారి జీవితాల్లో రెండు విషాదా సంఘటనలు ఉన్నాయి. అయినా వారు తమ జీవితంాన్ని ఫన్నీగా, థ్రిల్లింగ్‌గా గడపడం అనేది కథగా కనిపించింది.

ఒక రాజు.. ఒక రాణి కథలో..

ఒక రాజు.. ఒక రాణి కథలో..

చిన్నప్పడు నేను.. ఒక రాజు.. ఒక రాణి ఉంటుంది. వారిద్దరి చివరకు చనిపోతారు. దాంతో కథ ఖతం అయిపోతుంది అనే ఓ కథ వినేదానిని. కానీ ఇలాంటి కథలు ఎవరికీ నచ్చవు అంటూ ట్రైలర్‌ను ఎమోషనల్‌గా మొదలుపెట్టారు. ఈ సినిమాలోని హీరోయిన్ తన కథను చెప్పడం ప్రారంభించింది. నా పేరు కిజీ బసు. నాకు క్యాన్సర్ అంటూ అసలు విషయాన్ని బయటపెట్టింది. ఇలాంటి అమ్మాయికి ఓ ఇమ్మాన్యుయేల్ రాజ్‌కుమార్ అనే తుంటరి అబ్బాయి తారసపడ్డారు. తనకు కొన్నేళ్ల క్రితం ఎముకకు సంబంధించిన క్యాన్సర్ సోకిందని చెబుతాడు.

ఇద్దరు క్యాన్సర్ పేషెంట్ల మధ్య చిలిపి ప్రేమ

ఇద్దరు క్యాన్సర్ పేషెంట్ల మధ్య చిలిపి ప్రేమ


ఇలా ఇద్దరు క్యాన్సర్ పేషెంట్ల మధ్య జరిగే ఓ అందమైన ప్రేమ కథగా దిల్ బేచారా సినిమా రూపొందిందనేది స్పష్టమైంది. ఈ చిత్రంలో చిలిపి, తుంటరి సన్నివేశాలే కాకుండా హృదయాన్ని కదిలించే భావోద్వేగమైన సన్నివేశాలు కూడా ఉన్నాయనేది ట్రైలర్‌లో స్పష్టమైంది. చర్చిలో సుశాంత్‌తో ‘నా జీవితంలో నేను ఎప్పుడు సెక్స్ చేయలేదు' చెప్పించిన డైలాగ్స్ యూత్‌ను టార్గెట్ చేసే విధంగా ఉన్నాయి.

నీవు సీరియల్ కిల్లర్ అంటే.. నీవు సీరియల్ కిస్సర్ అంటూ

నీవు సీరియల్ కిల్లర్ అంటే.. నీవు సీరియల్ కిస్సర్ అంటూ

అంతేకాకుండా ఈ సినిమాలో రొమాంటిక్ సన్నివేశాలు బాగానే ఉన్నాయి. నీతో ఉండటం అంత సేఫ్ కాదు.. నీవు సీరియల్ కిల్లర్‌లా కనిపిస్తున్నావు అని హీరోయిన్ అంటే అంటే.. నేను సీరియల్ కిల్లర్‌ అయితే? నీవు సీరియల్ కిస్సర్ అంటూ హీరో తన హీరోయిన్‌ను ఆటపట్టించడం లాంటి సన్నివేశాలు కథను రొమాంటిక్‌గా మారేలా చేశాయి. ఇక చివర్లో నేను నీ గర్ల్ ఫ్రెండ్ కాదు.. అంటే ఇప్పుడేనా? ఎప్పటికి కూడానా? అంటే.. ఎప్పటికీ అని హీరోయిన్ జవాబిస్తే.. అబద్దాల కోరు అంటూ చిలిపిగా సుశాంత్ ఆటపట్టించడంతో ట్రైలర్ ముగుస్తుంది.

Recommended Video

Sushant Singh Rajput : Rhea Chakraborty తో గొడవ కారణంగానే Sushant సూసైడ్ చేసుకున్నాడా ?
తెర వెనుక, తెర ముందు

తెర వెనుక, తెర ముందు


నటీనటులు, సాంకేతిక నిపుణులు
నటీనటులు: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, సంజనా సంఘీ, సైఫ్ ఆలీ ఖాన్, మిలింద్ గునాజీ, జావేద్ జాఫ్రీ తదితరులు
దర్శకత్వం: ముఖేష్ చాబ్రా
నిర్మాత: ఫాక్స్ స్టార్ స్టూడియోస్
మ్యూజిక్: ఏఆర్ రెహ్మాన్
రచన: శశాంక్ ఖైతాన్, సుప్రోతిమ్ సేన్ గుప్తా
సినిమాటోగ్రఫి: సేతు
ఎడిటింగ్: ఆరీఫ్ షేక్
కొరియోగ్రఫి: ఫరాఖాన్, ఉమా గైతీ
రిలీజ్: జూలై 24
ఓటీటీ రిలీజ్: డిస్నీ+హాట్‌స్టార్

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X