twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    శ్రీమంతుడిగా మారిన దిల్ రాజు.. తిరిగి ఇచ్చేస్తానంటోన్న బడా ప్రొడ్యూసర్

    |

    టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్స్‌లో దిల్ రాజు కచ్చితంగా ముందుస్థానంలో ఉంటాడు. దిల్ రాజు మట్టి పట్టాడంటే కూడా అది బంగారమవుతుందని అంటారు. సినిమా కథలను ఎంచుకోవడం, ప్రేక్షకుల నాడిని పట్టుకోవడంతో దిల్ రాజు అందవేసిన చేయి అంటుంటారు. అలా దిల్ రాజు చేసే సినిమాల్లో దాదాపు 90 శాతం సక్సెస్ అవుతుంటాయి. అయితే ఈ మధ్యే దిల్ రాజు సినిమాలు మిశ్రమ ఫలితాన్ని అందుకున్నాయి. కానీ మళ్లీ దిల్ రాజు మునుపటిలా బ్లాక్ బస్టర్లు కొట్టేస్తున్నాడు.

    వరుసగా హిట్‌లు..

    వరుసగా హిట్‌లు..

    ఫిదా సినిమా నుంచి దిల్ రాజుకు మంచి హిట్లు పడుతున్నాయి. మహర్షి, సరిలేరు నీకెవ్వరు వంటి బ్లాక్ బస్టర్లు దిల్ రాజు ఖాతాలో పడ్డాయి. ఇక వకీల్ సాబ్ దిల్ రాజు కెరీర్‌లోనే నిలిచేపోయే చిత్రంగా మిగలనుంది. వకీల్ సాబ్‌కు సీజన్‌తో సంబంధం లేదు. ఎప్పుడు రిలీజ్ అయినా కూడా మినిమమ్ 100 150 కోట్లు కలెక్ట్ చేసేస్తుందని అంచనాలు వేస్తున్నారు.

    దిల్ రాజు 50వ బర్త్ డే..

    దిల్ రాజు 50వ బర్త్ డే..

    దిల్ రాజు 50వ బర్త్ డే (డిసెంబర్ 18) వేడుకలు ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నాయి. ఈ వేడుకలకు ఇండస్ట్రీ మొత్తం కదిలివచ్చింది. మెగాస్టార్, పవర్ స్టార్ దగ్గరి నుంచి కన్నడ రాకింగ్ స్టార్ రాకీ భాయ్ యశ్ కూడా విచ్చేశాడు. ప్రభాస్ రామ్ చరణ్ మహేష్ బాబు, చైసామ్ జంట, కుర్ర హీరోయిన్లు ఇలా ప్రతీ ఒక్కరూ దిల్ రాజు బర్త్ డే వేడుకల్లో మెరిశారు.

    ప్రత్యేక నిర్ణయం..

    ప్రత్యేక నిర్ణయం..

    దిల్ రాజు తన బర్ద్ డే వేడుకల్లో భాగంగా మాట్లాడు.. ఇది నాకొక గ్రేట్‌ ఎక్స్‌పీరియెన్స్ ముఖ్యంగా సక్సెస్‌లో ఉన్నప్పుడు నాకు ఇలాంటి మూమొంట్‌ రావడం నా అదృష్టం. సినిమా పరిశ్రమలోకి వచ్చి దాదాపు 25 సంవత్సరాలైంది. యాబై ఏళ్లలో పాతికేళ్లు సినిమాలతోనే అనుబంధ కొనసాగింది. ఎన్నో సక్సెస్‌లు సాధించి నిర్మాతగా ఎదిగా. ఈ క్రమంలోనే పేరు, డబ్బు వస్తుంటాయి. ఈ మధ్యే సెకండ్ లైఫ్‌ స్టార్ట్ చేశా. ఈ కొత్త లైఫ్‌లో ఏం చేయాలా అని ఆలోచిస్తుంటే.. సమాజానికి ఏదైనా తిరిగివ్వాలన్న ఆలోచన వచ్చిందని చెప్పుకొచ్చాడు.

    నిజమైన సమస్యలు..

    నిజమైన సమస్యలు..

    ఇక నుంచి తిరిగి ఇవ్వాలన్న ఉద్దేశ్యంతో సోషల్‌ సర్వీస్ ప్రారంభిస్తున్నాను. దీనిపై ఆసక్తి ఉన్నవారెవరైనా మాతో జాయిన్ కావొచ్చు. ముఖ్యంగా మీడియా వాళ్లకి నిజమైన సమస్యలు ఎక్కడున్నాయి.. వారు అబద్దం చెబుతున్నారా? నిజం చెబుతున్నారా? అన్నది ఎక్కువగా తెలుస్తుంది. కాబట్టి మీడియా వాళ్లు సహాయం చేయాలని కోరుకుంటున్నాను అని దిల్ రాజు తెలిపాడు.

    విద్య వైద్యం..

    విద్య వైద్యం..

    విద్యా, వైద్యానికి సంబంధించి ఎలాంటి సాయమైన చేసేందుకు నేను రెడీగా ఉంటాను.. మీడియా వాళ్లలో కూడా అందరూ మంచి స్టేజ్‌లోనే ఉండరు.. మీకూ ఎలాంటి సాయం కావాలన్నా నేను చేస్తాను అంటూ దిల్ రాజు తన బర్త్ డే సందర్భంగా కొత్త అడుగు వేశాడు. మొత్తానికి ఇప్పుడు దిల్ రాజు శ్రీమంతుడు సినిమాలో మహేష్ బాబులా మారిపోయాడన్న మాట. లాక్డౌన్ సమయంలో దిల్ రాజు ఎన్నో సహాయ కార్యక్రమాలు చేసిన సంగతి అందరికీ తెలిసిందే.

    English summary
    Dil Raju 50th Birthday Celebration Wants To Give back..
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X