మన ప్రేక్షకులను ఎవరు ఆపలేరు.. దానివల్ల వకీల్ సాబ్‌కు డోకా లేదు: దిల్ రాజు

ప్రస్తుతం వకీల్ సాబ్ సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా గ్యాప్ తరువాత నటించిన సినిమా కావడంతో అభిమానుల్లో అంచనాల డోస్ ఒక్కసారిగా పెరిగిపోయింది. గతంలో ఎప్పుడు లేని విధంగా అడ్వాన్స్ బూకింగ్స్ తోనే సినిమా సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేసేలా ఉంది. ఇక ఇటీవల నిర్వహించిన ప్రెస్ మీట్ లో నిర్మాత దిల్ రాజు కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలిపారు.

నభా నటేష్ లవ్లీ పిక్స్.. సరికొత్త అందాలతో ఇస్మార్ట్ బ్యూటీ

శని, ఆదివారాల్లో కూడా..

శని, ఆదివారాల్లో కూడా..

పింక్ సినిమాకు రీమేక్ గా వచ్చిన వకీల్ సాబ్ పై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. పవన్ కళ్యాణ్ సరికొత్త లుక్ తో పాటు ట్రైలర్ కూడా అంచనాల డోస్ ను పెంచేసింది. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే మరో లెవెల్ కు వెళ్లింది. అడ్వాన్స్ బూకింగ్స్ కేవలం మొదటి రోజే కాకుండా శని ఆదివారాలు కూడా సాలీడ్ గా ఉన్నాయి.

 50% ఆక్యుపెన్సీ..?

50% ఆక్యుపెన్సీ..?

ఇక ప్రస్తుతం థియేటర్స్ పై ఆంక్షలు విధించే ఛాన్స్ ఉన్నట్లు టాక్ వస్తున్న విషయం తెలిసిందే. మళ్ళీ 50% ఆక్యుపెన్సీతోనే నడిచే అవకాశం ఉన్నట్లు పలు రకాల రూమర్స్ వస్తున్నాయి. సీనిమాపై తాము మాత్రం చాలా కాన్ఫిడెన్స్ గా ఉన్నట్లు చెప్పిన దిల్ రాజు ఇప్పటివరకు 50% ఆక్యుపెన్సీ విషయం తమ వరకు రాలేదని అన్నారు.

 మన ప్రేక్షకులను ఎవరు ఆపలేరు

మన ప్రేక్షకులను ఎవరు ఆపలేరు

ప్రస్తుతం కోవిడ్ మరింత పెరుగుతున్నప్పటికి అది మనకు సాధారణ విషయంగా మారిపోయిందని, తగిన జాగ్రత్తలు తీసుకొని మన జీవితంలో ముందుకు సాగాలి అన్నారు. ఇక మన ప్రేక్షకులను ఎవరు ఆపలేరు అంటూ 50% ఆక్యుపెన్సీ పతిమితుల గురించి నాకు సమాచారం లేదని దిల్ రాజు వివరణ ఇచ్చారు.

Recommended Video

Pawan Kalyan Reaction After Watching Vakeel Saab
వకీల్ సాబ్ ప్రభావం చూపకపోవచ్చు..

వకీల్ సాబ్ ప్రభావం చూపకపోవచ్చు..

ఒకవేల థియేటర్స్ పై ఆంక్షలు విధించినప్పటికి వకీల్ సాబ్ సినిమాపై అది ప్రభావం చూపకపోవచ్చని దిల్ రాజు ధీమా వ్యక్తం చేశారు. ఇక వకీల్ సాబ్ సినిమా బిజినెస్ పరంగా కూడా సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. నాన్ థియేట్రికల్ గా సినిమా దాదాపు 50కోట్ల ప్రాఫిట్స్ అందుకున్నట్లు సమాచారం. ఇక సినిమా వరల్డ్ వైడ్ గా ఈ నెల 9న రిలీజ్ కబోతున్న విషయం తెలిసిందే. 8వ తేదీన అమెరికాలో ప్రీమియర్స్ ద్వారా వకీల్ సాబ్ సందడి మొదలు కానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X