»   » బాహుబలి బ్లాక్ : ప్రేక్షకుల తీరును తప్పుబట్టిన దిల్ రాజు

బాహుబలి బ్లాక్ : ప్రేక్షకుల తీరును తప్పుబట్టిన దిల్ రాజు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ‘బాహుబలి' సినిమా బ్లాక్ మార్కెటింగ్ జోరుగా సాగుతుందన్న విషయం గత కొన్ని రోజులుగా మీడియాలో హాట్ టాపిక్ అయింది. ఈ నేపథ్యంలో నైజాం ఏరియాలో ఈ చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్న దిల్ రాజు స్పందించారు. టికెట్స్ ఎవరూ బ్లాక్ చేయలేదని, బయట ఎవరైనా టికెట్స్ బ్లాక్ లో అమ్మితే కొనవద్దని సూచించారు.

సినిమాకు టికెట్లకు భాగా డిమాండ్ ఉన్న విషయమై దిల్ రాజు స్పందిస్తూ.... ప్రేక్షకులను బ్లాక్ లో కొనాల్సిన అవసరం లేదు. టికెట్ల కోసం మరొక రోజు ప్రయత్నించండి, ప్రపంచ వ్యాప్తంగా 4 వేల థియేటర్లలో సినిమా విడుదలైంది. మీరు అనుకున్న రోజే సినిమా టికెట్స్ దొరకాలంటే ఎలా అనే విధంగా దిల్ రాజు చెప్పుకొచ్చారు.


Dil Raju about Baahubali tickets

కాగా...బాహుబలి సినిమా బ్లాక్ టికెట్స్ విషయంలో ఇప్పటికే పలువురు అరెస్టయిన సంగతి తెలిసిందే. ఈ విషయాలను మీడియా వారు


ఇక ‘బాహుబలి' సినిమా గురించి మాట్లాడుతూ....తెలుగులో హాలీవుడ్ స్థాయిలో ‘బాహుబలి' సినిమా రావడం గర్వంగా ఉంది. ఒక తెలుగు వ్యక్తి ప్రపంచ స్థాయి సినిమా తీయడం, ఆ సినిమాకు నేను నైజాం డిస్ట్రిబ్యూటర్ గా ఉండటం హ్యాపీగా ఉందని దిల్ రాజు చెప్పుకొచ్చారు.

English summary
Dil Raju about Baahubali movie and black tickets.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu