»   » బ్లాక్ టికెట్లు అమ్ముకునే స్థాయికి దిగ జారలేదు: దిల్ రాజు

బ్లాక్ టికెట్లు అమ్ముకునే స్థాయికి దిగ జారలేదు: దిల్ రాజు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ‘బాహుబలి' సినిమా విడుదల ముందు బ్లాక్ టికెట్ల అంశం రెండు రాష్ట్రాలను ఊపేసిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా నైజాం ఏరియాలో, హైదరాబాద్ సిటీలో టికెట్లు వేల రూపాయలకు బ్లాక్ లో అమ్మడం హాట్ టాపిక్ అయింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు దాడులు చేసిన పలువురిని అరెస్టు చేసారు.

బాహుబలి సినిమాకు నైజాం ఏరియా డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు కావడంతో ఆయనపై ఆరోపణలు వచ్చాయి. ఆయనే బాహుబలి టికెట్లు బ్లాక్ చేయించి అమ్మిస్తున్నారనే ప్రచారం జరిగింది. తనపై వచ్చిన ఈ ఆరోపణలపై దిల్ రాజు స్పందించారు. బుధవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆయన స్పందిస్తూ...బ్లాక్‌లో టికెట్లు అమ్ముకునే స్థాయికి తాను దిగజారలేదని వ్యాఖ్యానించారు.


Dil Raju about black tickets issue

బాహుబలి సినిమా మంచి ఫలితాలు సాధించడం చాలా ఆనందంగా ఉందని, ఈ సినిమా ఒక కళాఖండమని దిల్ రాజు చెప్పుకొచ్చారు. ఇలాంటి సినిమాను నైజాం ఏరియాలో తమ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేటషన్స్ పంపిణీ దారుగా ఉండటం ఆనందంగా ఉందని తెలిపారు.


తన తర్వాతి సినిమాల గురించి మాట్లాడుతూ...ఆగస్టులో జూనియర్‌ ఎన్టీఆర్‌తో ఓ సినిమా నిర్మించనున్నట్లు తెలిపారు. సాయియిధరమ్‌తేజ్‌ హీరోగా నిర్మిస్తున్న సుబ్రమణ్యం ఫర్‌ సేల్‌ సినిమా ఆగస్టులో విడుదల చేస్తామని తెలిపారు. త్వరలో సునీల్‌తో ఓ సినిమా నిర్మించే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు.

English summary
Dil Raju about black tickets issue.
Please Wait while comments are loading...