»   » చిరంజీవి-రాజమౌళి ‘మగధీర’ విబేధాలపై.... దిల్ రాజు స్పందన!

చిరంజీవి-రాజమౌళి ‘మగధీర’ విబేధాలపై.... దిల్ రాజు స్పందన!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మగధీర సినిమా విషయంలో మెగాస్టార్ చిరంజవి, రాజమౌళి మధ్య విబేధాలు వచ్చాయని అప్పట్లో ఓ ప్రచారం జరిగింది. ఈ సినిమా మా అబ్బాయి వల్లే హిట్టయిందని చిరంజీవి అన్నారని, దీంతో హర్టయిన రాజమౌళి.... నేను స్టార్ డమ్ లేని వారితో కూడా సినిమా చేసి హిట్ కొడతానని సునీల్ తో 'మర్యాద రామన్న'.... తర్వాత 'ఈగ'తో సినిమా తీసి హిట్ కొట్టి తన స్టామినా నిరూపించుకుని చిరంజీవికి తగిన సమాధానం ఇచ్చారంటూ అప్పట్లో బాగా ప్రచారం జరిగింది.

ఈ విషయమై ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు స్పందిస్తూ... అవన్నీ రూమర్స్ మాత్రమే అని స్పష్టం చేసారు. అవన్నీ కేవలం మాటలు మాత్రమే, అందులో నిజం లేదు అన్నారు. ఇండస్ట్రీలో ఎవరి స్ట్రెంత్ వారిది అని తేల్చి చెప్పారు.

Dil Raju about Chiranjeevi and Rajamouli Magadheera Clashes

మగధీర చిత్రం తెలుగు సినీ ఇండస్ట్రీలో ఓ మ్యాజిక్. ఓ డైరెక్టర్ గా అతను ఆలోచించుకున్న దాని ఒక హీరోగా తను చేసిందే. ఒక నిర్మాతగా మగధీర క్రెడిట్ దర్శకుడితో పాటు హీరోకు కూడా ఇస్తాను అని దిల్ రాజు స్పష్టం చేసారు.

క్రియేటివిటీ అనేది డైరెక్టర్ రోల్... డైరెక్టర్ రాసుకుంటనే హీరో చేస్తాడు. అయితే అతని ఆలోచనలను తెరపై చేసి చూపించేది హీరోనే. బంగారు కోడి పెట్ట సాంగ్ ఉంది. ఒకప్పుడు చిరంజీవి గారు ఇరగదీసారు. అదే పెర్ఫార్మెన్స్ చరణ్ ఇవ్వగలిగాడు. దర్శకుడు, హీరో ఇద్దరూ సక్సెస్ ఫుల్ గా తన బాధ్యత నిర్వర్తించినపుడే సినిమాకు మంచి ఫలితం వస్తుంది అన్నారు దిల్ రాజు.

English summary
Producer Dil Raju has revealed about clashes between Megastar Chiranjeevi and Director Rajamouli over Magadheera Movie. Check out details.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu