ఎన్టీఆర్ 'బృదావనం' ఎలా ఉంటుందంటే...దిల్ రాజు
ఎన్టీఆర్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మిస్తున్న 'బృందావనం' చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. కీలక సన్నివేశాలతో పాటు రెండు పాటలు, రెండు ఫైట్లు చిత్రీకరించామని, జూలైకి సినిమా పూర్తవుతుందని చిత్ర నిర్మాత దిల్ రాజు చెప్పారు. 'లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కథాంశంతో ఈ సినిమా ఉంటుంది. ఎన్.టి.ఆర్. కున్న మాస్ ఇమేజ్, మా సంస్థకున్న ఫ్యామిలీ ఇమేజ్‌కి తగినట్లుగా ఈ సినిమా ఉంటుంది. ఎన్.టి.ఆర్. ఇంతవరకూ ఇలాంటి సినిమా చేయలేదని చెప్పగలను. అన్ని అంశాలు కథలో బాగా కుదిరాయి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సెప్టెంబరులో సినిమాను విడుదల చేస్తాం' అన్నారు. ఈ చిత్రానికి సహ నిర్మాతలు: శిరీష్, లక్ష్మణ్.
జూ ఎన్టీఆర్ దిల్ రాజు బృందావనం కాజల్ సమంత శ్రీహరి ప్రకాష్ రాజ్ jr ntr srihari kajal samantha dil raju prakash raj


Click it and Unblock the Notifications