ఎన్.టి.ఆర్ 'బృందావనం' గురించి దిల్ రాజు
'ఎన్.టి.ఆర్.కున్న మాస్ ఇమేజ్ మిస్ కాకుండా ఆయన్ని కొత్త కోణంలో చూపించే సినిమా ఇది. లక్కీగా అటువంటి సబ్జెక్ట్ కుదిరింది' అంటున్నారు దిల్ రాజు. అలాగే 'బృందావనం' చిత్రం 60 శాతం పూర్తయిందనీ, ఆగస్టు నెల్లో ఈ సినిమాను విడుదల చేస్తామన్నారు. ఎన్టీఆర్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు. కాజల్, సమంతా ఈ చిత్రంలో హీరోయిన్స్ గా చేస్తున్నారు. అలాగే తమ సంస్థ నిర్మించిన 'రామ రామ కృష్ణ కృష్ణ' చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్ ను అలరిస్తూ విజయవంతంగా ప్రదర్శింపబడుతోందని నిర్మాత 'దిల్' రాజు చెప్పారు. ఎ క్లాస్ సెంటర్స్‌లో రెవెన్యూ బాగుందని పేర్కొంటూ 'లైలా' తుఫాను వల్ల సినిమాకి కొంత ఎఫెక్ట్ అయిందని తెలిపారు. ఈ సినిమా కాస్ట్ కంట్రోల్ విషయంలో ఫెయిల్ అయ్యామని అంగీకరిస్తూ బడ్జెట్ ను అదుపు చెయ్యడమన్నది ఇప్పుడు నిర్మాత చేతుల్లో లేకుండా పోయిందని ఆయన అన్నారు. తమ సంస్థ నిర్మిస్తున్న చిత్రాల వివరాలను మీడియా సమావేశంలో వివరించారు రాజు.


Click it and Unblock the Notifications











