కాలర్ ఎగరేసి మరీ చెబుతున్నా: దిల్ రాజు

By Srikanya

"కాలర్ ఎగరేసి మరీ చెబుతున్నా. ఇంత గొప్ప సినిమా తీసినందుకు ఆనందంగా ఉంది.ప్రతి ఒక్కరికీ ఫ్రెండ్స్ ఉంటారు. మంచి మార్గంలో నడిపిస్తూ ఎదుగుదలకు కృషి చేసే వారే మంచి ఫ్రెండ్. దర్శకుడు వేణు ఈ చిత్రంలో సర్‌ప్రైజ్ ఎలిమెంట్స్ ఇచ్చారు.మణిశర్మ మంచి నేపథ్య సంగీతాన్నిచ్చారు. మా సినిమాను తప్పకుండా ఈ నెల 11న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం''అని నిర్మాత దిల్ రాజు తన తాజా చిత్రం ఓ మై ప్రెండ్ గురించి చెప్పారు. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్న చిత్రం 'ఓ మై ఫ్రెండ్'. దిల్‌రాజు నిర్మాత. సిద్ధార్థ, శ్శృతి హాసన్, హన్సిక, నవదీప్ కీలక పాత్రధారులు. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల్లోనే గ్రాండ్ గా విడుదల కాబోతోంది.

దర్శకుడు వేణుశ్రీరామ్ చెబుతూ "యూత్‌ను టార్గెట్ చేసే చిత్రాన్ని తీశాను.'శ్రీ చైతన్య...' పాటను అనిల్‌రెడ్డి కంపోజ్ చేశాడు. అతనికి ఆ పాటను అంకితం చేస్తున్నాం.ఈ సినిమాకు పని చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. పాటలను ఆదరించారు''అని అన్నారు. హీరో సిద్ధార్థ్ మాట్లాడుతూ "రాహుల్‌ రాజ్ మంచి సంగీతాన్నిచ్చారు. దర్శకుడు నా కోసం రెండేళ్ళు వేచి ఉన్నాడు. ఆశ్చర్యకరమైన అంశాలతో వేణు ఈ చిత్రాన్ని రూపొందించాడు. దిల్‌రాజు నాకు మంచి సినిమా ఇచ్చారు'' అని తెలిపారు.

'ఓ మై ఫ్రెండ్'లో అలీ, తనికెళ్ళ భరణి, రఘుబాబు, లక్ష్మీ రామకృష్ణన్, వినయ్‌ప్రసాద్ తదితరులు ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి బాణీలు: రాహుల్‌రాజ్, నేపథ్య సంగీతం: మణిశర్మ, కెమెరా: విజయ్.కె.చక్రవర్తి, పాటలు: సిరివెన్నెల, కృష్ణచైతన్య, కళ: ఎస్.రవీందర్, లైన్ ప్రొడ్యూసర్: అశోక్, నిర్మాతలు: దిల్‌రాజు, శిరీష్, లక్ష్మణ్, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: వేణుశ్రీరామ్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X