ఆప్యాయతల కోసం పరితపించిన కథ: దిల్ రాజు
హైదరాబాద్ : ఆప్యాయతల కోసం పరితపించిన ఇద్దరు అన్నదమ్ముల కథే మా చిత్రం 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' అంటున్నారు దిల్ రాజు. వెంకటేష్, మహేష్‌బాబు హీరోలుగా నటిస్తున్నారు. సమంత హీరోయిన్. ప్రకాష్‌రాజ్, జయసుధ, అంజలి ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకుడు. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతోంది. డిసెంబరు 21న సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు.
దర్శకుడు మాట్లాడుతూ ''ఆత్మీయానురాగాలకు నెలవైన ఉమ్మడి కుటుంబం చుట్టూ తిరిగే కథ ఇది. వెంకటేష్, మహేష్‌బాబు నటన అందర్నీ ఆకట్టుకుంటుంది. సకుటుంబ సపరివార సమేతంగా చూసేలా తీర్చిదిద్దాం. ప్రేమాభిమానాలకు సరితూగే సిరిసంపదలు లేనే లేవు. ఆస్తుల్ని మళ్లీ సంపాదించగలం.. కానీ అనుబంధాలను కాదు అనే మాట ఆ కుటుంబం నమ్ముతుంది. అదే మా సినిమాలో చూపెడుతున్నాం '' అన్నారు.
మహేష్ సరసన సమంత, వెంకటేష్ సరసన అంజలి నటిస్తున్నారు. వెంకీ-మహేష్ అన్నదమ్ముళ్లుగా నటిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే టాలీవుడ్ లో భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. అన్నదమ్ముల రిలేషన్ ఈ చిత్రంలో మెయిన్‌గా ఫోకస్ కానుంది. సమంత, అంజలి, ప్రకాష్ రాజ్, జయసుధ, రోహిణి హట్టంగడి, రావు రమేష్, ఆహుతి ప్రసాద్, బ్రహ్మానందం, రమాప్రభ, తనికెళ్ల భరణి, కోట శ్రీనివాసరావు, రవిబాబు తదితరులు నటిస్తున్న ఈచిత్రానికి సంగీతం: మిక్కీ జె. మేయర్, కెమెరా: కె.వి.గుహన్, కళ: ఎ.ఎస్. ప్రకాష్, ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేష్, సహ నిర్మాతలు: శిరీష్, లక్ష్మణ్, నిర్మాత: దిల్ రాజు, కథ- స్క్రీన్ ప్లే- మాటలు- దర్శకత్వం: శ్రీకాంత్ అడ్డాల.


Click it and Unblock the Notifications











