'ఎవడు': టోటల్‌గా టెక్నీషియన్స్ ఫిలిం
హైదరాబాద్ : రామ్‌చరణ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మిస్తున్న చిత్రం 'ఎవడు' . ఈ చిత్రం ఈ నెల్లోనే విడుదల కోసం సిద్ధమవుతోంది. శ్రుతిహాసన్, ఎమీ జాక్సన్ హీరోయిన్స్ . ఇటీవల విడుదల చేసిన ఆడియోకు మంచి స్పందన వచ్చిందని నిర్మాత చెప్పారు.
నిర్మాత మాట్లాడుతూ... ' చిత్రంలో ప్రత్యేకపాత్రల్లో అల్లు అర్జున్, కాజల్ అగర్వాల్ నటించారు. రామ్‌ప్రసాద్ అందించిన ఫొటోగ్రఫీ అద్భుతంగా ఉంది. ప్రతి ఫ్రేమ్ కలర్‌ఫుల్‌గా ఉండి నటీనటులంతా ఎంతో అందంగా కనిపిస్తారు. ఓ వైవిధ్యమైన కథని వినూత్నమైౖన కథనంతో దర్శకుడు వంశీ తెరకెక్కించారు. ఇది టోటల్‌గా టెక్నీషియన్స్ ఫిలిం. దేవిశ్రీప్రసాద్ స్వరపరిచిన పాటలు హిట్ కావడం, ట్రైలర్‌కి అద్భుతమైన స్పందన రావడం చాలా ఆనందంగా ఉంది. ఆద్యంతం థ్రిల్లింగ్‌గా ఉండే ఈ చిత్రం అందరినీ ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది' అన్నారు.
రామ్ చరణ్ మాట్లాడుతూ....రెండు సంవత్సరాల క్రితమే కథ చెప్పారు. ఎంతో అద్భుతమైన కథ. సినిమాకు పని చేస్తున్న అందరితో నేను తొలిసారి చేస్తున్నాను. మగధీర తర్వాత బాగా ఎగ్జైట్ అయింది'ఎవడు' కథ విన్న తర్వాతే. దేవిశ్రీ ప్రసాద్ మంచి సంగీతం అందించారు. ఈ సినిమాలో కొంచెం అందంగా కనిపించాను. దానికి కెమెరామెన్ రాంప్రసాదే కారణం. ఈ సినిమాకు పని చేసిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు అన్నారు.
అల్లు అర్జున్ మాట్లాడుతూ...బన్నీ కెరీర్లో 'ఎవడు' బిగ్గెస్ట్ హిట్టవుతుంది. చిరంజీవి 150వ సినిమాలో ఒక్క ఫ్రేములో కనిపించినా చాలు అన్నారు. ఈ చిత్రానికి కథ: వంశీ పైడిపల్లి, వక్కంతం వంశీ, మాటలు: అబ్బూరి రవి, కథాసహకారం: హరి, సహ నిర్మాతలు: శిరీష్, లక్ష్మణ్.


Click it and Unblock the Notifications












