'ఓ మై ఫ్రెండ్'తో కనెక్ట్ కాలేకపోతున్నారు: దిల్ రాజు
'ఓ మై ఫ్రెండ్' సినిమా ప్రీమియర్ షోలు చూసిన వారు మిశ్రమంగా స్పందించారు. కానీ ప్రేక్షకులు సూపర్‌హిట్ అన్నారు. 30 శాతం మంది హిట్ అంటే 40 శాతం సూపర్ హిట్ అంటున్నారు. మిగిలిన వారు సినిమాతో కనెక్ట్ కాలేకపోతున్నారు'' అని దిల్ రాజు అన్నారు. ఆయన తాజా చిత్రం ఓహ్ మై ప్రెండ్ మొన్న శుక్రవారం విడుదలైంది. సిద్ధార్థ, నవదీప్, శృతి హాసన్, హన్సిక నటించిన 'ఓ మై ఫ్రెండ్' ఈ చిత్రానికి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ప్రమోషన్ లో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇలా స్పందించారు. అలాగే ...నేను 'ఓ మై ఫ్రెండ్' సినిమా విడుదలకు ముందు నమ్మకంగా మాట్లాడిన మాటలు.. కొంతమందికి ఓవర్ కాన్ఫిడెన్స్‌గా అన్పించాయి అన్నారు.
అలాగే ..బొమ్మరిల్లుతో పోల్చుకుని అంచనాలతో సినిమా చూసిన వారిని మాత్రం ఈ చిత్రం ఆకట్టుకోలేకపోయింది. ఇక్కడ ప్రీమియర్ షో చూసిన బన్ని, రామ్‌లు సైతం క్లైమాక్స్ 20 నిమిషాలు అద్భుతంగా తీశారన్నారు. ఎం.ఎస్.రాజు, అల్లు అరవింద్ కూడా మంచి సినిమా అన్నారు. రెవెన్యూ అద్భుతంగా ఉంది. విడుదలైన ప్రతి థియేటర్‌లోనూ హౌస్ ఫుల్స్‌తో రన్ అవుతోంది. యువత నుంచి మంచి స్పందన వస్తోంది. నవంబర్ 15 నుంచి హైదరాబాద్‌లోని థియేటర్స్‌ను విజిట్ చేయనున్నాం. అల్టిమేట్‌గా మా అంచనాలను ఈ చిత్రం అందుకుంది అని చెప్పుకొచ్చారు.


Click it and Unblock the Notifications











