మెగా అభిమానుల సమక్షంలోనే 'ఎవడు' : దిల్ రాజు
హైదరాబాద్: రామ్‌చరణ్ హీరోగా నటిస్తున్న చిత్రం 'ఎవడు'. శ్రుతిహాసన్, అమీ జాక్సన్ కథానాయికలు. ఈ చిత్రంలో అల్లు అర్జున్, కాజల్ ప్రత్యేక పాత్రల్లో తళుక్కున మెరుస్తారు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. 'ఎవడు' చిత్ర గీతాలను ఈ నెల 30న హైదరాబాద్‌లో విడుదల చేయబోతున్నారు.
నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ ''చరణ్‌తో మా సంస్థ చేస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రమిది. షూటింగ్ చివరి దశకు చేరుకొంది. ఇటీవలే స్విట్జర్లాండ్, బ్యాంకాక్‌ల్లో రెండు గీతాలు తెరకెక్కించాం. దేవిశ్రీప్రసాద్ స్వరాలు అందర్నీ ఉర్రూతలూగిస్తాయి. పలువురు సినీ ప్రముఖులు, మెగా అభిమానుల సమక్షంలో పాటలను విడుదల చేస్తాం. సినిమా వచ్చే నెల చివరి వారంలో తెరపైకి వస్తుంది''అన్నారు.
ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలోని ఏడెకరాల స్థలంలో జరుగుతోంది. ఇక్కడ రామ్ చరణ్, శృతి హాసన్‌పై పాటల చిత్రీకరణ జరుగుతోంది. ఈ పాటల చిత్రీకరణ ప్రముఖ కొరియెగ్రాఫర్ శేఖర్ సమక్షంలో జరుగుతోంది. మాస్‌ను ఆకట్టుకునే విధంగా ఈ సాంగును తెరకెక్కిస్తున్నారు.
'ఎవడు' చిత్రం ఆడియో రిలీజ్ డేట్ అఫీషియల్‌గా ఖరారైంది. జూన్ 30వ తేదీ ఆడియో వేడుక జరుపనున్నట్లు రామ్ చరణ్ పిఆర్ఓ వెల్లడించారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. జులై చివరి వారంలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఈ చిత్రంలో జయసుధ, సాయికుమార్, కోట శ్రీనివాసరావు, రాహుల్‌దేవ్, అజయ్, ఎల్బీ శ్రీరామ్ తదితరులు నటిస్తున్నారు. సహ నిర్మాతలు: శిరీష్, లక్ష్మణ్, కళ: ఆనంద్‌సాయి, కూర్పు: మార్తాండ్ కె.వెంకటేష్, ఛాయాగ్రహణం: సి.రామ్‌ప్రసాద్.


Click it and Unblock the Notifications











