'సీతమ్మ వాకిట్లో...'వెనక అసలు కథ
వెంకటేష్,మహేష్ కాంబినేషన్ లో దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రం 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'. ఈ చిత్రం గురించి నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ...విరగబూసిన సిరిమల్లె చెట్టుని ఆ పూట సీతమ్మకి అంకితం చేశారు. కొమ్మ కదలకుండా పూలు కోశారు. కోసిన పూలన్నీ వాలుజడకి చుట్టారు. సీతమ్మ సింగారం వెనక అసలు కథేమిటో తెలియాలంటే మా చిత్రం చూడాల్సిందే అన్నారు దిల్ రాజు.
అలాగే తెలుగుదనం ఉట్టిపడే కథ ఇది. మన ఇంట్లో జరుగుతున్నట్టే అనిపిస్తుంది. అన్నదమ్ములుగా ఇద్దరు కథానాయకులు ఒదిగిపోయిన విధానం చాలా బాగుంది. ఇటీవల విడుదల చేసిన ప్రచార చిత్రానికి చక్కటి స్పందన లభించింది. ఇంటర్నెట్‌లో ఆ పాట బిట్ చాలామంది వీక్షిస్తున్నారు అన్నారు. ఉమ్మడి కుటుంబ నేపథ్యంలో సాగే కథే 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'. కథలో భావోద్వేగాలు అందరినీ కదిలిస్తాయి. వెంకటేష్, మహేష్‌బాబుల పాత్రలు అందరికీ గుర్తుండిపోతాయి. సీత పాత్ర కథలో చాలా కీలకం. ప్రకాష్‌రాజ్ మరోసారి ఓ ఉదాత్తమైన పాత్రలో కనిపిస్తారు. మల్టీస్టారర్ చిత్రాలకు ఈ సినిమా నాంది అవుతుంది అన్నారు.
'సింపుల్ అండ్ బ్యూటిఫుల్'చిత్రం ట్యాగ్ లైన్ తో వస్తున్న ఈ చిత్రంలో వెంకటేష్, మహేష్‌బాబు హీరోలుగా చేస్తున్నారు. సమంత,అంజలి, జయసుధ, ప్రకాష్‌రాజ్ కీలక పాత్రధారులు. శ్రీకాంత్ అడ్డాల దర్శకుడు. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌సిటీలో చిత్రీకరణ జరుగుతోంది. అక్కడ తీర్చిదిద్దిన ప్రత్యేక సెట్‌లో ప్రధాన తారాగణంపై కుటుంబ సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు.
రోహిణి, రావు రమేష్, ఆహుతిప్రసాద్, బ్రహ్మానందం, రమాప్రభ, తనికెళ్ళ భరణి, కోట శ్రీనివాసరావు, రవిబాబు తదితరులు ఇతర పాత్రధారులు. సహనిర్మాత: శిరీష్, లక్ష్మణ్, ఛాయాగ్రహణం: కె.వి.గుహన్,పాటలు: సీతారామశాస్త్రి, సంగీతం: మిక్కీ జె.మేయర్.


Click it and Unblock the Notifications











