సీతమ్మ వాకిట్లో...' అవన్నీ చూపిస్తున్నాం
హైదరాబాద్ : 'నా' అంటే నా కుటుంబం అని అర్థం. ఆ కుటుంబంలో అమ్మ, నాన్న, అన్న, వదిన, బాబాయ్... ఇలా ఎన్ని బంధాలున్నాయో. అవన్నీ మా 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమాలో చూపిస్తున్నాం. సంతోషం అనేది విలాసవంతమైన జీవితాల్లోనో, ఖరీదైన నివాసాల్లోనో ఉండదు. మన చుట్టూ ప్రేమించే వాళ్లుంటే.. పూరి గుడిసెలోనైనా హాయిగా బతికేయొచ్చు. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ విజయవంతమైంది అక్కడే అంటున్నారు దిల్‌రాజు. ఆయన తాజా చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరగుతోంది. మీడియాతో మాట్లాడుతూ ఇలా స్పందించారు.
'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రంలో వెంకటేష్, మహేష్‌బాబు హీరోలుగా నటిస్తున్నారు. సమంత, ప్రకాష్‌రాజ్, జయసుధ, అంజలి కీలక పాత్రలు పోషిస్తున్నారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతోంది. డిసెంబరు 21న ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. దర్శకుడు మాట్లాడుతూ ''భారతదేశం ఓ సీతమ్మ వాకిలి. అందులో సిరిమల్లె చెట్టు ఉమ్మడి కుటుంబ వ్యవస్థ. అందులోని మమతానురాగాలను మా సినిమాలో చూపిస్తున్నాం. కుటుంబ సమేతంగా చూడదగిన సినిమా ఇది. మిక్కీ.జె.మేయర్ సంగీతం ఆహ్లాదకరంగా సాగిపోతుంది'' అని చెప్పారు.
ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమా ఆడియో ని నవంబర్ 18న విడుదల చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ చిత్రంలో మొత్తం ఏడు పాటలు ఉన్నాయి. మిక్కీ జె. మేయర్ అందించే ఈ చిత్రం లో పాటలు సినిమాకు బాగా ప్లస్ అవుతాయని,ఆడియో సూపర్ హిట్ అవుతుందని చెప్తున్నారు. రెండు పాటలు,ప్యాచ్ వర్క్ మినహా ఈ చిత్రం షూటింగ్ పూర్తైంది.
ఇక ఈ చిత్రం ఆడియో పంక్షన్ ని తిరుపతి లో నిర్వహించాలని ప్లాన్ చేస్తనున్నట్లు సమాచారం. వేలాది మంది వెంకటేష్ ప్యాన్స్,మహేష్ ప్యాన్స్ సమక్షంలో గ్రాండ్ గా ఈ చిత్రం ఆడియో చేయాలని దిల్ రాజు తన హీరోలతో చెప్పినట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన కొత్త పోస్టర్లు మహేష్ బాబు బర్త్ డేను పురస్కరించుకుని విడుదలయ్యాయి. ఇందులో వెంకీ, మహేష్ కాంబినేషన్, గెటప్‌లకు మంచి రెస్పాన్స్ వస్తోంది.
సమంత, అంజలి, ప్రకాష్ రాజ్, జయసుధ, రోహిణి హట్టంగడి, రావు రమేష్, ఆహుతి ప్రసాద్, బ్రహ్మానందం, రమాప్రభ, తనికెళ్ల భరణి, కోట శ్రీనివాసరావు, రవిబాబు తదితరులు నటిస్తున్న ఈచిత్రానికి సంగీతం: మిక్కీ జె. మేయర్, కెమెరా: కె.వి.గుహన్, కళ: ఎ.ఎస్. ప్రకాష్, ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేష్, సహ నిర్మాతలు: శిరీష్, లక్ష్మణ్, నిర్మాత: దిల్ రాజు, కథ- స్క్రీన్ ప్లే- మాటలు- దర్శకత్వం: శ్రీకాంత్ అడ్డాల.


Click it and Unblock the Notifications











