20 ఏళ్లు పూర్తి చేసుకున్న దిల్ రాజు బేనర్, ఇకపై సరికొత్త స్ట్రాటజీ!

తెలుగు సినిమా పరిశ్రమలో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌‌కు, ఆ సంస్థ అధినేత దిల్ రాజుకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఎన్నో విజయవంతమైన చిత్రాలు నిర్మించడంతో పాటు డిస్ట్రిబ్యూట్ చేసిన ఈ సంస్థ టాలీవుడ్లో అగ్రనిర్మాణ సంస్థల్లో ఒకటిగా వెలుగొందుతోంది. తమ సంస్థ విజయవంతంగా 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దిల్ రాజు మీడియాతో మీట్ అయ్యారు.

ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ... సినిమా డిస్ట్రిబ్యూషన్ ద్వారా మా బ్యాన‌ర్ ప్రస్థానం 1999లో ఒకే ఒక్క‌డు మూవీతో మొదలైంది, దానికి ముందు జూలై 24న తొలిప్రేమ చిత్రాన్ని పార్ట్‌న‌ర్ షిప్‌లో రిలీజ్ చేశాం. ప‌వ‌న్‌ క‌ళ్యాణ్‌గారిని పెద్ద స్టార్‌గా నిలబెట్టిన సినిమా అది. 'పెళ్లి పందిరి' చిత్రం నిర్మాతగా రాణించడానికి తోడ్పడిందని తెలిపారు. ఆ సినిమా తర్వాత డిస్ట్రిబ్యూష‌న్ నుండి ప్రొడ‌క్ష‌న్‌లోకి ఎంటరయినట్లు తెలిపారు.

Dil Raju about Sri Venkateswara Creations 20 years journey

తమ సంస్థ నిర్మాణం మొదలు పెట్టి 16 సంవత్సరాలైంది. ఇప్పటి వరకు 32 సినిమాలు పూర్త‌ి చేశాం. ఇది మాకు ఒక గొప్ప జర్నీ, ఈ కాలంలో రకరకాల పరిస్థితులు చూశాం, ఎన్నో విషయాలు నేర్చుకున్నాం. సినిమా విజయం వెనక స్క్రిప్ట్ మొదలు పెట్టినప్పటి నుంచి రిలీజ్ అయ్యే వరకు చాలా విషయాలు ఉంటాయని దిల్ రాజు తెలిపారు.

2017లో మా సంస్థ‌లో అత్యధికంగా 6 సినిమాలు చేశాం. 2018లో 3 సినిమాలు, 2019లో 4 సినిమాలు విడుద‌ల కాబోతున్నాయి. కేవలం మాకు మేముగా సినిమాలు నిర్మించడమే కాకుండా ఇండస్ట్రీలోకి రావాలనుకుంటున్న కొత్త నిర్మాతలకు సపోర్ట్ చేయాలని అనుకుంటున్నాం. మా బేనర్లో అసోసియేట్ అవ్వడం ద్వారా స్క్రిప్ట్ ద‌గ్గ‌ర నుండి రిలీజ్ వ‌ర‌కు సపోర్ట్ చేసి ప్రేక్షకులకు మంచి సినిమాలు అందించేలా మావంతు కృషి చేయాలనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు దిల్ రాజు తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X