'సీతమ్మ వాకిట్లో... ' ఆడియో రిలీజ్ గురించి దిల్ రాజు
హైదరాబాద్: వెంకటేష్, మహేష్ బాబు హీరోలుగా నటిస్తున్న చిత్రం 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'. ఈ చిత్రం పాటల విడుదలకు ముహూర్తం ఖరారైంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ముఖ్య సన్నివేశాల్ని రామోజీ ఫిల్మ్‌సిటీలో తెరకెక్కిస్తున్నారు. ఈ నెల 16న హైదరాబాద్‌లో ఆడియో విడుదల చేస్తున్నట్లు నిర్మాత దిల్ రాజు తెలిపారు.
దిల్ రాజు మాట్లాడుతూ '' హైదరాబాద్ నానక్‌రామ్‌గూడ రామానాయుడు స్డూడియో గ్రౌండ్స్‌లో అభిమానులు, సినీ ప్రముఖుల సమక్షంలో ఆడియోను విడుదల చేయబోతున్నాం. మునుపెన్నడూ లేని విధంగా సరికొత్త రీతిలోఆడియో వేడుకను నిర్వహిస్తాం. సినీ ప్రముఖులు, అభిమానుల సమక్షంలో పాటల్ని విడుదల చేయబోతున్నాం. ఈ కార్యక్రమాన్ని వినూత్న శైలిలో నిర్వహిస్తా ము'' అన్నారు.
సహ నిర్మాతలు శిరీష్, లక్ష్మణ్ మాట్లాడుతూ 'పూనేలో మహేశ్, సమంతపై ఈ నెల 6 నుంచి 10 వరకూ ఓ పాట తీశాం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఈ నెల 19 నుంచి 21 వరకూ వెంకటేశ్, అంజలిపై కేరళలోని చాలకుడిలో ఓ పాట చిత్రీకరించడంతో షూటింగ్ పార్ట్ పూర్తవుతుంది. సంక్రాంతి సందర్భంగా జనవరిలో చిత్రాన్ని విడుదల చేస్తాం' అని తెలిపారు.
ప్రకాష్ రాజ్, జయసుధ, రోహిణి హట్టంగడి, అభినయ, కోట శ్రీనివాసరావు, వేణుమాధవ్, తనికెళ్ల భరణి, బ్రహ్మానందం, మురళీ మోహన్, రావు రమేశ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: మిక్కీ జే.మేయర్, ఫొటోగ్రఫీ: కె.వి.గుహన్, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: శ్రీకాంత్ అడ్డాల.


Click it and Unblock the Notifications











