.. చివర్లో ఏడిపించేశారు..: దిల్ రాజు
హైదరాబాద్ : నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ ''చాన్నాళ్ల తరవాత తెలుగులో వస్తున్న మల్టీస్టారర్ చిత్రమిది. ఒక్క చోట కూడా అభ్యంతరం తెలుపలేదు. 'మంచి సినిమా తీశారు.. చివర్లో ఏడిపించేశారు..' అని సెన్సార్ సభ్యులు ప్రశంసించారు'' అన్నారు. వెంకటేష్, మహేష్‌బాబు హీరోలుగా నటించిన చిత్రం 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'. సమంత హీరోయిన్.
అంజలి, ప్రకాష్‌రాజ్, జయసుధ ప్రధాన పాత్రలు పోషించారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించారు. దిల్ రాజు నిర్మాత. ఈ నెల 11న ఈ చిత్రాన్ని విడుదల చేస్తారు. సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. 'యు' సర్టిఫికేట్ లభించింది. ఈ సందర్బంగా మీడియాతో దిల్ రాజు మాట్లాడుతూ ఇలా స్పందించారు. వెంకటేష్ మాట్లాడుతూ ''కుటుంబసమేతంగా చూడాల్సిన సినిమా ఇది. కథలోనూ పండగ వాతావరణం ఉంటుంది. మహేష్‌తో కలిసి నటించడం ఆనందంగా ఉంది'' అని చెప్పారు.
''దర్శకుడు చెప్పిన కథ స్ఫూర్తినిచ్చింది. అదే మమ్మల్ని నడిపించింది . అన్ని విధాలా సంతృప్తినిచ్చిన చిత్రమిది. అందరితోపాటు నేను కూడా దీని గురించి ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. దర్శకుడు కథని తీర్చిదిద్దిన విధానం బాగుంది. ఆయన ఈ చిత్రం కోసం రెండేళ్లు కష్టపడ్డారు'' అని మహేష్‌బాబు చెప్పారు.
''పేరులోనే కాదు, సినిమాలోనూ తెలుగుదనం కనిపిస్తుంది. ఇద్దరు హీరోలను ఒకే తెరపై చూపించడం మంచి కథ ఉంటేనే సాధ్యం. అలాంటి కథ ఈ సినిమాలో ఉంది. కుటుంబ విలువలకు పెద్దపీట వేశాము''అని దర్శకుడు చెప్తున్నారు. ఇందులో ఒక్క పాత్ర కూడా వృథాగా ఉండదు. ఒక్క సీన్ వేస్ట్‌గా ఉండదు. అంత పగడ్బందీ స్క్రీన్‌ప్లేతో సినిమాను రూపొందిస్తున్నాం. దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ సినిమాను నిర్మిస్తున్నారు. నన్ను దర్శకుడిగా పరిచయం చేసిన ఆయన బేనరులోనే రెండో సినిమా కూడా చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే ఉమ్మడి కుటుంబ నేపథ్యంలో సాగే కథే 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'. కథలో భావోద్వేగాలు అందరినీ కదిలిస్తాయి. వెంకటేష్, మహేష్‌బాబుల పాత్రలు అందరికీ గుర్తుండిపోతాయి. సీత పాత్ర కథలో చాలా కీలకం. ప్రకాష్‌రాజ్ మరోసారి ఓ ఉదాత్తమైన పాత్రలో కనిపిస్తారు. మల్టీస్టారర్ చిత్రాలకు ఈ సినిమా నాంది అవుతుంది అన్నారు.


Click it and Unblock the Notifications











