‘సీతమ్మ వాకిట్లో...’ సీక్వెల్ హీరోలు ప్రకటించిన దిల్ రాజు
హైదరాబాద్ : 2013 సంక్రాంతికి విడుదల అవుతున్న 'సీతమ్మ వాకిట్లో...' చిత్రంపై నిర్మాత దిల్ రాజు ఎంత కాన్ఫిడెన్స్ గా ఉన్నారంటే అప్పుడే ఆయన చిత్రానికి సీక్వెల్ తీస్తానని ప్రకటించేసారు. అంతేగాక ఆ సీక్వెల్ లో నటించే హీరోలు ఎవరనేది ఆయన చెప్పేసారు. ఇంతకీ 'సీతమ్మ వాకిట్లో...' సీక్వెల్ లో నటించబోయే హీరోలు ఎవరూ.. అంటే...గౌతమ్, అర్జున్. వీళ్లిద్దరూ ఎవరూ అంటే...ఒకరు మహేష్ బాబు కుమారుడు....మరొకరు..వెంకటేష్ కుమారుడు.
మహేష్‌బాబుతో కలిసి వెంకటేష్ నటించిన చిత్రం 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'. సమంత హీరోయిన్. అంజలి, ప్రకాష్‌రాజ్, జయసుధ ముఖ్యపాత్రలు పోషించారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించారు. దిల్‌రాజు నిర్మాత. మిక్కీ జె.మేయర్ స్వరాలు సమకూర్చారు. ఆదివారం హైదరాబాద్‌లో ఈ చిత్రంలోని పాటలు విడుదలయ్యాయి. ఈ స్టేజిపై దిల్ రాజు ఈ విషయాన్ని ప్రస్దావించారు.
దిల్ రాజు మాటల్లోనే...'' 20 ఏళ్ల తర్వాత వెంకటేష్, మహేష్ కుమారులు అర్జున్, గౌతమ్‌తో ఈ సినిమా సీక్వెల్ తీస్తాను...''అన్నారు. అలాగే...మా సంస్థ స్థాపించి పదేళ్లయ్యింది. ఈ నేపథ్యంలో ఇంత మంచి మల్టీస్టారర్‌ని మా సంస్థలో చేసినందుకు శ్రీకాంత్‌కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. షూటింగ్ జరుగుతున్నంతసేపు వెంకటేష్, మహేష్ నిజమైన అన్నదమ్ములయ్యారు. ''అన్నారు
ఈ చిత్రం ఆడియో తొలి సీడీని వెంకటేష్ కుమారుడు అర్జున్ ఆవిష్కరించి మహేష్‌బాబు తనయుడు గౌతమ్ కృష్ణకి అందజేశారు. పాటల ఆవిష్కరణ హైదరాబాదులోని నానక్‌రామ్‌గూడలోని రామానాయుడు స్టూడియోలో అత్యంత వైభవంగా జరిగింది. పంక్షన్ లో మహేష్,వెంకటేష్ కుమారులు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు.


Click it and Unblock the Notifications











