SVSC టాక్.. .దిల్ రాజు కళ్లలో నీళ్లు!
హైదరాబాద్: ''సంవత్సరం పాటు ఎంతో కష్టపడి 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమా తీసాం. కమర్షియల్ సినిమాలు ఇండస్ట్రీని ఏలుతున్న ఈ రోజుల్లో సాహసోపేతంగా ఫ్యామిలీ సినిమా తీసాం. మహేష్ బాబు అభిమానులు, వెంకటేష్ ఫ్యాన్స్ సినిమాను ఎలా రిసీవ్ చేసుకుంటారో అని తెన్షన్ పడ్డాను. మార్నింగ్ షో పూర్తయిన తర్వాత సినిమా బాగుందని అప్రిషియేట్ చేయడంతో నా కళ్లలో నీళ్లు తిరిగాయి. అద్భుతమైన సినిమా అని ప్రశంసిస్తుంటే సంవత్సరం పాటు పడ్డ కష్టాన్నంతా మరిచి పోయాను. ఇంత వరకు నేను చేసిన ఏ సినిమాకు లేని ఆనందం ఈ సినిమాతో దక్కింది' అంటూ తన మనసులోని మాటలను బయట పెట్టారు నిర్మాత దిల్ రాజు.
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రం నిన్న విడుదలైన ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుండటంతో నిర్మాత దిల్ రాజు సక్సెస్ మీట్ ఏర్పాటు చేసారు. సినిమా సక్సెస్ గురించి మరిన్ని విషయాలు వెల్లడిస్తూ... 'దర్శకుడు రాఘవేంద్ర రావు ఫోన్ చేసి మేము మరిచి పోయిన లైన్ ను నువ్వు సినిమాగా తీసావ్. మంత్రి శ్రీధర్ బాబు ఫోన్ చేసి చాలా రోజుల తర్వాత ఓ మంచి సినిమా చేసావని చెప్పడం, డివిడి వచ్చిన తర్వాత తొలి కాపీ తనకే పంపాలని చెప్పడం ఎన్నటికీ మరిచిపోలేను' అన్నారు.
సినిమా ఫ్యామిలీ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటుంది. సినిమా, ఆడియో హిట్టయిన నేపథ్యంలో వచ్చే వారం ప్లాటినమ్ డిస్క్ ఫంక్షన్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అదే విధంగా 14, 15, 16 తేదీల్లో మహిళా ప్రేక్షకుల కోసం ప్రత్యేకమైన షోలు వేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అందుకు సంబంధించిన వివరాలు త్వరలో వెల్లడిస్తామని దిల్ రాజు చెప్పుకొచ్చారు.
వెంకటేష్, మహేష్ బాబు, అంజలి, సమంత హీరో హీరోయిన్లుగా రూపొందిన 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రానికి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించారు. మిక్కీజే మేయర్ సంగీతం అందించగా, మణిశర్మ బ్యాగ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బేనర్‌పై దిల్ రాజు బారీ బడ్జెట్‌తో ఈచిత్రాన్ని నిర్మించారు.


Click it and Unblock the Notifications











