బోల్డ్, నెగిటివ్‌గా ఉపేంద్ర సినిమాలు... ఆయనను చూసే.. ఐ లవ్‌ యు ఫంక్షన్‌లో దిల్ రాజు

కన్నడ సూపర్‌స్టార్స్‌లో ఒకరు, తెలుగు ప్రేక్షకుల్లోనూ సూపర్‌ స్టార్‌డమ్‌ సంపాదించుకున్న రియల్‌ స్టార్‌ ఉపేంద్ర హీరోగా నటించిన తాజా సినిమా 'ఐ లవ్‌ యు'. 'నన్నే... ప్రేమించు' అనేది క్యాప్షన్‌. రచితా రామ్‌ హీరోయిన్‌. తెలుగు పరిశ్రమకు 'కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ'తో దర్శకుడిగా పరిచయమైన ఆర్‌. చంద్రు, శ్రీ సిద్ధేశ్వరా ఎంటర్‌ప్రైజెస్‌ పతాకంపై స్వీయ దర్శకత్వంలో ఈ సినిమాకు నిర్మించారు. సోమవారం హైదరాబాద్‌లో ఈ సినిమా తెలుగు టీజర్‌ విడుదల చేశారు.

ఉపేంద్ర సినిమాలు చూసి

ఉపేంద్ర సినిమాలు చూసి

‘దిల్‌' రాజు మాట్లాడుతూ ‘‘నేను 1998లో ‘పెళ్లి పందిరి', పవన్‌కల్యాణ్‌ ‘తొలిప్రేమ' చిత్రాలతో డిస్ట్రిబ్యూటర్‌గా సక్సెస్‌ అవుతున్న టైమ్‌. అప్పుడు ఉపేంద్రగారి సినిమాలను ‘తొలిప్రేమ'తో కంపేర్‌ చేస్తే.. పిచ్చి సినిమాలుగా అనిపించాయి. ‘ఇదేంటి? ఇలాంటి సినిమాలు ప్రేక్షకులు చూస్తారా?' అనుకునేవాణ్ణి. తర్వాత తర్వాత నేను ‘ఆర్య' స్క్రిప్ట్‌ చూసినప్పుడు... ఉపేంద్రగారి సినిమాలు చూశా. ఆయన ఎలా చేశారు? బోల్డ్‌గా, నెగిటివ్‌గా వెళుతున్నప్పుడు క్యారెక్టర్‌ను ఎలా బ్యాలెన్స్‌ చేయాలి? అని ఆయన చూశా. ఈరోజు ఆయన సినిమా ఫంక్షన్‌కి రావడం సంతోషంగా ఉంది. ‘ఐ లవ్‌ యు' సినిమా దర్శకుడు, నిర్మాత చంద్రు రెండు రోజులుగా నేను ఈ ఫంక్షన్‌కి రావాలని రిక్వెస్ట్‌ చేస్తున్నారు. ఉపేంద్రగారితో పాటు ఆయన కోసం వచ్చాను. తెలుగులో, కన్నడలో సినిమా మంచి సక్సెస్‌ కావాలని ఆశిస్తున్నా'' అన్నారు.

ఉపేంద్ర రియల్ స్టార్, కల్ట్ స్టార్

ఉపేంద్ర రియల్ స్టార్, కల్ట్ స్టార్

లగడపాటి శ్రీధర్‌ మాట్లాడుతూ ‘‘ఉపేంద్రగారు రియల్‌ స్టార్‌, కల్ట్‌ స్టార్‌. నా ఆల్‌టైమ్‌ ఫేవరెట్‌ సినిమాల్లో ఆయన దర్శకత్వం వహించిన ‘ఓం' సినిమా ఒకటి. నెల క్రితం మళ్ళీ చూశా. కన్నడలో ‘ఓం' ఆ సినిమాను రీ రిలీజ్‌ చేస్తే బాగా ఆడిందని చెప్పారు. అలాగే, ఎన్నో సినిమాలు తీశారు. తెలుగులో ‘ఏ' సినిమాతో కల్ట్‌ స్టార్‌గా యంగ్‌స్టర్స్‌లో పెద్ద ఫాలోయింగ్‌ సంపాదించుకున్నారు. మొన్నటికి మొన్న ‘సన్నాఫ్‌ సత్యమూర్తి'లో మంచి క్యారెక్టర్‌ చేశారు. అందరి హృదయాల్లో చోటు సంపాదించుకున్నారు. ‘ఏ' + ‘ఉపేంద్ర' = ‘ఐ లవ్‌ యు' అని చెప్పడం నచ్చింది. టైటిల్‌ కంటే క్యాప్షన్‌ ‘నన్నే.. ప్రేమించు' నాకు బాగా నచ్చింది అని అన్నారు.

ఉపేంద్రకు రుణపడి ఉంటాను

ఉపేంద్రకు రుణపడి ఉంటాను

చిత్రదర్శకుడు ఆర్‌. చంద్రు మాట్లాడుతూ ‘‘తెలుగులో ఈ సినిమా విడుదలవుతుండటం చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్‌ లగడపాటి శ్రీధర్‌గారికి నేను రుణపడి ఉంటాను. నేను తీసిన ‘చార్మినార్‌' చూసి ‘నువ్వు తెలుగులో ఒక సినిమా తీయాలి' అని, నా కథపై అభిమానంతో ఆయన ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ' నిర్మించారు. ‘ఐ లవ్‌ యు' నా కెరీర్‌లో 11వ సినిమా. ‘లవ్‌ అండ్‌ సెక్స్‌... అంటే ఎరోటిక్‌ కాదు. రొమాంటిక్‌' అనే లైన్‌తో ఈ ట్రెండ్‌కి తగ్గట్టు సినిమా తీస్తే ఎలా ఉంటుందని ఆయన దగ్గరకు వెళ్ళా. ఆయన కథ విని, ‘ఇది ఒక గీతాంజలి అవుతుంది' అన్నారు. లవ్‌, సెక్స్‌ మధ్య వ్యత్యాసాన్ని ఇప్పటి ట్రెండ్‌కి తగ్గట్టు చెప్పాం. చక్కటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌. జీవితంలో ‘ఐ లవ్‌ యు' ఎవరికి చెప్పాలి? మనం ఎవరికి చెబుతున్నాం? అనే థీమ్‌తో తెరకెక్కిన సినిమా ఇది. ఉపేంద్రగారి స్టైల్‌లో చెబుతున్నాం'' అన్నారు.

ఉపేంద్ర చక్కగా.. యంగ్‌గా ఉంటారు

ఉపేంద్ర చక్కగా.. యంగ్‌గా ఉంటారు

నటి సంజన మాట్లాడుతూ ‘‘సినిమా టీజర్‌ బావుంది. స్టార్టింగ్‌ సినిమాల్లో ఉపేంద్రగారు ఎంత చక్కగా, యంగ్‌గా ఉన్నారో... ఈ సినిమాలోనూ అంత అందంగా ఉన్నారు. ఈ సినిమా దర్శకుడు ఆర్‌. చంద్రు నాకు గురువు. ఇక్కడ తెలుగులో పూరి జగన్నాథ్‌గారు ‘బుజ్జిగాడు' సినిమాతో బ్రేక్‌ ఇచ్చారో... కన్నడలో అలా శివరాజ్‌కుమార్‌గారు నటించిన ‘మైలారి' సినిమాతో ఆర్‌. చంద్రుగారు బ్రేక్‌ ఇచ్చారు.

 నటీనటులు, సాంకేతిక వర్గం

నటీనటులు, సాంకేతిక వర్గం

సోను గౌడ, బ్రహ్మానందం, హోనవళ్ళి కృష్ణ, జై జగదీష్‌, పీడీ సతీష్‌ తదితరులు నటించిన ఈ చిత్రానికి

పీఆర్వో: నాయుడు - ఫణి

స్టంట్స్‌: గణేష్, వినోద్, డా. కే రవి వర్మ

కాస్ట్యూమ్ డిజైనర్: అర్చన (ఉపేంద్ర), తేజస్విని (రచితా రామ్)

కాస్ట్యూమర్: గండశి నాగరాజ్
ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: మునీంద్ర కె. పుర

సినిమాటోగ్రఫీ: సుజ్ఞాన్‌

ఎడిటర్‌: దీపు ఎస్‌. కుమార్‌
లైన్‌ ప్రొడ్యూసర్‌: విజయ్‌ సూర్య

ఆర్ట్‌ డైరెక్టర్‌: మోహన్‌ బి. కేరే

కొరియోగ్రఫీ: చిన్ని ప్రకాష్‌, ధను, మోహన్‌

లిరిక్స్: డా చల్లా భాగ్యలక్ష్మి

మ్యూజిక్‌ డైరెక్టర్‌: డా. కిరణ్‌ తోటంబైల్‌

రచన, నిర్మాణం, దర్శకత్వం: ఆర్‌. చంద్రు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X