రామ్ చరణ్ 'ఎవడు' గురించి దిల్ రాజు
హైదరాబాద్ : రామ్‌చరణ్ హీరోగా నటిస్తున్న చిత్రం 'ఎవడు'. శ్రుతిహాసన్, అమీ జాక్సన్ హీరోయిన్స్. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే రెండు పాటల్ని స్విట్జర్లాండ్, బ్యాంకాక్‌లో చిత్రీకరించారు. షూటింగ్ కార్యక్రమాలు తుది దశకు చేరాయి. ఈ సందర్భంగా నిర్మాత దిల్ రాజు మీడియాతో మాట్లాడారు.
దిల్ రాజు మాట్లాడుతూ ''వైవిధ్యమైన కథ, కథనాలతో సాగే చిత్రమిది. చరణ్ నటన, నృత్యాలు ప్రేక్షకుల్ని అలరిస్తాయి. ఈ చిత్రంలో అల్లు అర్జున్, కాజల్ ప్రత్యేక పాత్రల్లో నటిస్తున్నారు''అన్నారు.
ఇక ఈ నెలలో పాటల్నీ, వచ్చే నెలలో చిత్రాన్నీ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కోట శ్రీనివాసరావు, జయసుధ, సాయికుమార్, రాహుల్‌దేవ్, అజయ్, ఎల్.బి.శ్రీరాం, సుప్రీత్, వెన్నెల కిషోర్ తదితరులు ఇతర పాత్రధారులు. సహ నిర్మాతలు: శిరీష్-లక్ష్మణ్, కూర్పు: మార్తాండ్.కె.వెంకటేష్, కళ: ఆనంద్ సాయి, సంగీతం: దేవిశ్రీప్రసాద్


Click it and Unblock the Notifications











