కొత్త సంవత్సరంలో మా సంస్థ నుండి వస్తున్న తొలి చిత్రం 'ఆకాశమంత'. తమిళ వెర్షన్ ఇటీవల విడుదలయింది. మంచి ఆదరణ పొందుతోంది. అలాగే మా సంస్థ నుండి ఒక సినిమా వస్తోందంటే అందులో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుందనే ఇమేజ్‌ను ప్రేక్షకులలో ఏర్పరచుకున్నాం. అందుకే తెలుగులో చాలా మార్పులు చేస్తున్నాం. దీనికి సంబంధించిన షూటింగ్ జనవరిలో జరుగుతుంది. ఇది సినిమా కథ కాదు 20 ఏళ్ల జీవితం. క్యూట్ ఫిలిం. తప్పకుండా విజయవంతమవుతుంది. అంటున్నారు దిల్ రాజు. ప్రకాష్‌రాజ్, త్రిష తండ్రికూతుళ్లుగా నటించిన 'ఆకాశమంత' చిత్రాన్ని ఉగాది సందర్భంగా మార్చి 27న విడుదల చేయనున్నట్లు ' ఆయన చెప్పారు.