నేనూ తప్పులు చేశాను. ఇబ్బందిపడ్డాను...దిల్ రాజు
టెక్నికల్ గా మనం బాగానే ఉన్నాం. అయితే సినిమాకోసం పెట్టిన పెట్టుబడిని తిరిగి సంపాదించుకోవడంలో ఇబ్బందిపడుతున్నాం. అలాగ్ మంచి కథను ఎంచుకొంటున్నాం. అయితే దాన్ని తెర మీదకు తీసుకురావడంలో తప్పులు జరుగుతున్నాయి. కథ చెప్పిన ప్రకారం ఖర్చు చేసుకొంటూ వెళ్తే తప్పు జరగదు. ఎక్కడో తేడా జరుగుతోంది. నష్టాలొస్తున్నాయి. ఆ విధంగా నేనూ తప్పులు చేశాను. ఇబ్బందిపడ్డాను అంటున్నారు దిల్ రాజు. తెలుగు సినిమా పరిస్థితి గురించి మీడియాతో మాట్లాడుతూ ఇలా స్పందించారు. అలాగే హీరోల రెమ్యునేషన్ తగ్గించుకోవాలనే డిమాండ్ గురించి మాట్లాడుతూ...రెమ్యునేషన్స్ అనేవి డిమాండ్ - సప్లయ్ సూత్రాన్ని బట్టే ఉంటాయి. నేను ఇవ్వకపోయినా మరొకరు వెళ్లి అడిగినంతో అంతకంటే ఎక్కువో ఇవ్వవచ్చు.అయితే అదనపు ఖర్చులు నియంత్రించుకోగలిగితే నిర్మాతలకు చాలా ఇబ్బందులు తగ్గుతాయి అన్నారు. ఆయన తాజా చిత్రం గగనం రేపు విడుదల అవుతోంది.


Click it and Unblock the Notifications











