పోలీసు డిపార్టమెంటే చేతులెత్తేసింది..దిల్ రాజు
కావాలంటే ఈ రోజున పైరసీ సీడీలున్న వంద షాపులు చూపిస్తాం. అయితే మేం వెళ్లేలోగా వాళ్లకు సమాచారం వెళ్లిపోతోంది. వాళ్లు జాగ్రత్త పడిపోతారు. పోలీసు డిపార్ట్‌మెంట్ ఏం చెయ్యలేకపోతోంది అంటూ ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిలదీసారు. సినిమా కష్టాలపై ఆదివారం ఓ ప్రెవేట్ టీవీ ఛానెల్ నిర్వహించిన 'ఓపెన్ డిబేట్' కార్యక్రమంలో పైరసీ విషయమై చర్చ వచ్చింది. ఈ సందర్భంగా దిల్ రాజు పై విధంగా స్పందించారు. అలాగే చెన్నై, బెంగళూరు కేంద్రాలుగా పైరసీ జరుగుతోందని నిర్మాత 'దిల్' రాజు తెలిపారు. కనీసం కొన్నాళ్లయినా పైరసీ సీడీలు బయటికి రాకుండా ఆపాలంటూ తామే స్వయంగా డబ్బులు ఇవ్వాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. పైరసీ ఎవరు చేస్తున్నారో నిర్దిష్టంగా తెలిసినా, వాళ్లపై చర్యలు తీసుకోలేకపోతున్నారని చెప్పారు. ఆయన రీసెంట్ గా విడుదల చేసిన బృందావనం చిత్రం పైరసీకి గురి అవుతోందంటూ ఈ సందర్భంగా ప్రస్దావించారు.


Click it and Unblock the Notifications











