బ్రేకింగ్ : కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నాను.. పెళ్లిపై దిల్ రాజు ప్రకటన.. ఎప్పుడు, ఎక్కడంటే..?

గత కొన్ని రోజులుగా టాలీవుడ్ చిత్రసీమలో దిల్ రాజు పెళ్లి వార్త ఎంతగా వైరల్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పెద్ద సినిమాల అప్‌డేట్స్, హీరో హీరోయిన్ల గాసిప్ వార్తల కన్నా దిల్ రాజు రెండో పెళ్లి అనేది సెన్సేషన్‌గా మారింది. కొన్ని సైట్స్ అయితే ఏకంగా దిల్ రాజు పెళ్లి అయిపోయిందని వార్తలు వడ్డించాయి. ఆ రూమర్స్‌పై దిల్ రాజు బాగా హర్ట్ అయ్యాడని గుసగుసలు వినిపించాయి.

Recommended Video

Arya @16 Years: Interesting Stories Behind Allu Arjun's Arya Movie

తన రెండో పెళ్లిపై ఇలాంటి అసత్య ప్రచారాలేంటని? ఒకవేళ చేసుకుంటే.. అందరికీ చెప్పే చేసుకుంటాను కదా? అని సన్నిహితుల దగ్గర వాపోయాడట. అయితే తాజాగా ఈ వార్తలన్నింటికి పుల్ స్టాప్ పడింది. రెండో పెళ్లిపై దిల్ రాజు అధికారికంగా స్పందించాడు.

అనిత మృతి అనంతరం..

అనిత మృతి అనంతరం..

దిల్ రాజు భార్య అనిత 2018లో మృతి చెందిన సంగతి తెలిసిందే. భార్య మృతితో మానసికంగా దిల్ రాజు కుంగిపోయాడు. వ్యక్తిగత వ్యవహారాలను చూసుకోవడానికి ఓ తోడు కావాలని దిల్ రాజు రెండో పెళ్లికి సిద్దమయ్యాడు. అయితే వీటిపై గత కొన్ని రోజులుగా వచ్చిన రూమార్స్ నేడు నిజమయ్యాయి. దిల్ రాజు స్వయంగా ఓ ప్రెస్ నోట్ ద్వారా రెండో పెళ్లి విషయాన్ని ధృవీకరించాడు.

అధికారిక ప్రకటన..

అధికారిక ప్రకటన..

రెండో పెళ్లి గురించి స్పందిస్తూ అధికారికంగా ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. అందులోని సారాంశం ఏంటంటే.. ‘ప్రపంచం ఎలాంటి పరిస్థితుల్లో ఉందో అందరికీ తెలిసిందే.. ఇలాంటి సమయంలో వృత్తిపరంగా అంత త్వరగా కోలుకోలేము. వ్యక్తిగతంగానూ నాకు గత కొన్ని రోజుల నుంచి మంచి కాలం రాలేదు.

కొత్త జీవితంలోకి..

కొత్త జీవితంలోకి..

అయితే అంతా త్వరలోనే సర్దుకుంటుందని, అందరికీ మంచి జరుగుతుందని ఆశిస్తున్నాను. అలాంటి ఆశతోనే మరొకొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకుంటున్నాను. అందుకు ఈ సమయమే అనువైనదిగా భావించి.. నా వ్యక్తిగత జీవితాన్ని తిరిగి పున: ప్రారంభించాలని అనుకుంటున్నా'ని ప్రకటించాడు.

నిజామాబాద్ గుడిలో..

నిజామాబాద్ గుడిలో..

నిజామాబాద్‌లోని దిల్ రాజుకు సంబంధించిన గుడిలో ఆదవారం రాత్రి పెళ్లి చేసుకోబోతోన్నట్టు తెలుస్తోంది. అయితే ఈ పెళ్లికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం అతి కొద్ది మందే హాజరవుతున్నట్టు సమాచారం. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు పది మంది వరకు విచ్చేస్తున్నట్టు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X