‘అందాల రాక్షసి’ రిలీజ్ డేట్ ప్రకటించిన దిల్ రాజు
నవీన్ చంద్ర, రాహుల్ కథానాయకలుగా...లావణ్య కథానాయికగా రూపొందుతున్న ఈచిత్రాన్ని సాయి కొర్రపాటి, ఎస్ఎస్ రాజమౌళి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. హను రాఘవపూడి దర్శకుడిగా పరిచయవుతున్నాడు. రధన్ సంగీతం అందించారు. గతంలో రాజమౌళి ఈ సినిమా దర్శకుడి గురించి మాట్లాడుతూ....బాండ్ పేపర్ మీద రాసిస్తాను... హను కచ్చితంగా గొప్ప దర్శకుడు అవుతాడు. అందాల రాక్షసి నా సినిమాలాంటిదే. ఐదేళ్ల క్రితం హను రూపొందించిన షార్ట్ ఫిల్మ్ చూశాను. అత్యద్భుతంగా రూపొందిన లఘు చిత్రాల్లో అదొకటి అన్నారు.
రాజమౌళి ఈ చిత్రం నిర్మాణంలో పాలు పంచుకోవడం, దిల్ రాజు లాంటి సూపర్ హిట్ చిత్రాల డిస్ట్రిబ్యూటర్ ఈచిత్రాన్ని దక్కించుకోవడంతో 'అందాల రాక్షసి' చిత్రంపై భారీ అంచనాలున్నాయి. 90ల్లోని వాతావరణంలో ట్రయాంగిల్ లవ్ స్టోరీగా దీన్ని తెరకెక్కించారు. ఇంత మంది ప్రముఖులు ఈ చిత్రాన్ని ఆకాశానికి ఎత్తేయడంతో తప్పకుండా హిట్టవుతుందనే నమ్మకం ట్రేడ్ వర్గాల్లో వ్యక్తం అవుతోంది.


Click it and Unblock the Notifications












