సిద్దార్ద హీరోగా దిల్ రాజు చిత్రం ప్రకటన
మా ప్రొడక్షన్ హౌస్ లో చాలా చిత్రాలకు అసెస్టెంట్ గా పనిచేసిన వేణు శ్రీరామ్ అనే దర్శకుడుని త్వరలో దర్శకుడుగా పరిచయం చేస్తున్నాం. ఇప్పటికే నేను స్క్రిప్టు మొత్తం విని ఇంప్రెస్ అయి సిద్దార్ధకి నేరేట్ చేయించాను. అతను వెంటనే ఓకే చేసారు. ప్రభాస్ చిత్రం ఫినిష్ కాగానే..సిద్దార్ధతో ఈ చిత్రాన్ని ప్రారంభిస్తాం అంటూ ప్రకటన చేసారు దిల్ రాజు. దిల్ రాజు హైదరాబాద్ లోని తన కార్యాలయంలో ఈ విషయాన్ని సోమవారం సాయింత్రం మీడియాకు తెలియచేసారు. ఇక గతంలో సిద్దార్ధతో బొమ్మరిల్లు వంటి సూపర్ హిట్ చిత్రాన్ని ఇచ్చిన నిర్మాత దిల్ రాజు మరోసారి ఆ విజయాన్ని రిపీట్ చేసే ధీమాలో ఉన్నారు. బొమ్మరిల్లు తర్వాత వీరిద్దరు కాంబినేషన్లో మరో చిత్రం రాలేదు. ఇప్పుడు ఈ కాంబినేషన్ రిపీట్ కావటంతో మంచి క్రేజ్ ఏర్పడుతుందని తెలుస్తోంది. అలాగే ఈ చిత్రం ప్రేమ, స్నేహం చుట్టూ తిరిగే రొమాంటిక్ కామిడి అని తెలుస్తోంది. ఈ చిత్రంపై దిల్ రాజు చాలా ఆశలు పెట్టుకున్నట్లు రీసెంట్ గా ఓ ఇంటర్వూలో ఓ ప్రెష్ ధాట్ తో చిత్రం చేయనున్నట్లు చెప్పారు. అలాగే ఈ చిత్రానికి రోటీ..కపడా అండ్ రొమాన్స్ అనే టైటిల్ పెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక సిద్దార్ధ ప్రస్తుతం రాఘవేంద్రరావు కుమారుడు కె.ప్రకాశరావు దర్శకత్వంలో రెడీ అవుతున్న ఫాంటసీ చిత్రంలోనూ, రాంబాబు అనే నూతన దర్శకుడుని పరిచయం చేస్తూ నిర్మితమవుతున్న బావ చిత్రంలోనూ చేస్తున్నాడు.


Click it and Unblock the Notifications











