కొత్త భార్య ఆదేశాలతో మారిన దిల్ రాజు లైఫ్ స్టైల్.. ఆ రూల్స్ పాటించాల్సిందే!
టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నిర్మాత దిల్ రాజు. ఇండస్ట్రీలో అడుగు పెట్టి 20 ఏళ్లవుతోంది. డిస్ట్రిబ్యూటర్ గా కెరీర్ ని స్టార్ట్ చేసి ఆ తరువాత స్టార్ ప్రొడ్యూసర్ గా మారిన దిల్ రాజు చూస్తుండగానే సౌత్ టాప్ ప్రొడక్షన్ హౌజ్ లలో ఒకటిగా తన సంస్థను నిలిపాడు. ఇక ఇటీవల వివాహం చేసుకున్న దిల్ రాజు సరికొత్తగా కనిపిస్తున్నాడు. ఆయన భార్య వలన జీవితంలో చాలా మార్పులు చోటుచేసుకుంటున్నాయి.

లాక్ డౌన్ లోనే పెళ్లి..
లాక్ డౌన్ లో మొదట పెళ్లి చేసుకున్న సెలబ్రెటీ దిల్ రాజు. మొదటి భార్య అనిత మరణించిన మూడేళ్ళ తరువాత కుటుంబ సభ్యుల సమక్షంలో మరో వివాహం చేసుకున్న ఈ సీనియర్ ప్రొడ్యూసర్ జీవితంలో మునుపెన్నడు లేని విధంగా కొన్ని కొత్త మార్పులు వచ్చినట్లు తెలుస్తోంది.

మరో సెల్ఫీ వైరల్..
రీసెంట్ గా భార్య వ్యఘా రెడ్డి అలియాస్ తేజస్వినితో దిల్ రాజుతో ఒక సెల్ఫీకి స్టిల్ ఇచ్చిన విధానం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దిల్ రాజు సరికొత్త ఫిట్నెస్ తోనే కాకుండా కొంత న్యూ ఫేస్ తో కనిపిస్తున్నాడు. ఇటీవల ఈ దంపతులు తిరుపతికి వెళ్లిన విషయం తెలిసిందే. చూస్తుంటే దిల్ రాజు పూర్తిగా న్యూ లైఫ్ ని స్టార్ట్ చేసినట్లు అనిపిస్తోంది.

భార్య స్పెషల్ కేరింగ్..
నిత్యం సినిమాలు, కథ చర్చలు అంటూ బిజీగా ఉండే రాజు గారు ఇప్పుడు ఇండోర్ స్టేడియంలలో అలాగే స్పెషల్ ట్రావెలింగ్ తో బిజీ అవుతున్నారు. దీనికి ప్రధాన కారణం ఆయన సతీమణి అని తెలుస్తోంది. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వీరికి సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతూనే ఉన్నాయి. భర్త ఆనందంలో భార్య పాత్ర చాలా ఉంటుంది. అదే తరహలో వ్యఘా కూడా తన భర్త నిత్యం సంతోషంగా ఉండేలా ఇలా జాగ్రత్తలు తీసుకుంటోంది.

ఆమె ఆదేశాలు పాటించాల్సిందే..
ప్రతి ఉదయం కొంత సేపు వ్యాయామం చేయాల్సిందేనట. ఎంత బిజీగా ఉన్నా కూడా సాయత్రం 5గంటల లోపు ఇంట్లో ఉండాలని అప్పుడు కాస్త బ్యాడ్మింటన్ వంటి గేమ్స్ తప్పనిసరిగా ఆడాలని ఆమె ఆర్డర్ వేస్తున్నారట. దీంతో దిల్ రాజు కూడా శ్రీమతి గారు చెప్పినట్లు నడుచుకుంటూ మరీంత ఆరోగ్యంగా ఉండేందుకు శ్రద్ద తీసుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











