»   »  మళ్లీ రంగంలోకి దిల్ రాజు....అల్లు అర్జున్ తో

మళ్లీ రంగంలోకి దిల్ రాజు....అల్లు అర్జున్ తో

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఎప్పుడూ వరుస సినిమాలు నిర్మిస్తూ, మూవీ డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ చేస్తూ బిజిగా ఉండే నిర్మాత దిల్ రాజు.......'ఎవడు' సినిమా తర్వాత అసలు ఏ ప్రాజెక్టు మొదలు పెట్టలేదు. అటు డిస్ట్రిబ్యూషన్ వ్యవహారాలకు కూడా దూరంగా ఉన్నారు. కూతురు వివాహం సందర్భంగా సినిమా బిజినెస్ కొంతకాలం పాటు పూర్తిగా పక్కన పెట్టేసారు.

తాజాగా దిల్ రాజు మళ్లీ రంగంలోకి దిగుతున్నారు. ప్రస్తుతం ఆయన 'కేరింత' అనే చిత్రం నిర్మించబోతున్నారు. త్వరలో ఈచిత్రం సెట్స్ పైకి వెళ్లబోతోంది. మరో వైపు అల్లు అర్జున్ హీరోగా 'ఓ మై ఫ్రెండ్' ఫేమ్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో మరో సినిమా ప్లాన్ చేస్తున్న తెలుస్తోంది.

Dil Raju back into business

ఇటీవల తిరుమల వచ్చిన ఆయన తన తర్వాతి సినిమా ప్రాజెక్టుల గురించి వివరిస్తూ.... కొత్త వారితో 'కేరింత' అనే సినిమా చేస్తున్నానని తెలిపారు. అంతేగాకుండా 'లవర్', 'కలిసి ఉంటే కలదు సుఖం' చిత్రాలకు ప్లాన్ చేసినట్లు దిల్ రాజు తెలిపారు. 'కేరింత' చిత్రానికి సాయి కిరణ్ అడవి దర్శకత్వం వహించబోతున్నారు.

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, మై డ్రీం సినిమా బ్యానర్ ఫై దిల్ రాజు, సాయి కిరణ్ అడవి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ స్టేజీలో ఉన్న ఈ చిత్రం త్వరలో మొదలు కానుంది. ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా మిక్కి జే మేయర్ ను ఎంపిక అయ్యారు. ముగ్గురు అబ్బాయిలు, ఇద్దరమ్మాయిల నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో కొత్తవాళ్లు నటిస్తారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: విశ్వ, కూర్పు: మధు, పాటలు: సిరివెన్నెల సీతారామశాస్త్రి, సహనిర్మాతలు: శిరీష్‌-లక్ష్మణ్‌.

English summary
After daughter Marriage, Now Dil raju is back into business. Dil Raju is planning to restart the production aggressively with two movies of ‘Kerintha’ in direction of Sai Kiran Adavi waiting to go on sets since a long time and secondly, a film with Allu Arjun in direction of Venu Sriram of ‘Oh My Friend’ fame.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X