twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దిల్‌ రాజు చేతికి ‘బాద్‌ షా’, నైజాంలో రికార్డులే లక్ష్యంగా..!

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటిస్తున్న 'బాద్‌ షా' చిత్రం నైజాం రైట్స్ ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్‌రాజు దక్కించుకున్నారు. రికవరబుల్ అడ్వాన్స్ బేసిస్‌లో రూ. 10 కోట్లు చెల్లించి ఆయన ఈ చిత్రం రైట్స్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది.

    ఏ తెలుగు సినిమా తీసుకున్నా నైజాం మార్కెట్ కీలకం. ఇక్కడ సినిమా వసూలు చేసే దాన్ని బట్టే సినిమా లాభనష్టాలు ఆధారపడి ఉంటాయి. మరో వైపు సినిమా రికార్డులు బద్దలు కొట్టాలన్నా ఇక్కడ కేటాయించబడే థియేటర్ల సంఖ్యే కీలకం. ఈ నేపథ్యంలో నైజాం ఏరియాపై మంచి పట్టున్న దిల్ రాజు అయితేనే మంచి ఫలితాలు వస్తాయనేది నిపుణుల అంచనా.

    'బాద్‌ షా' చిత్రాన్ని మొత్తం నైజాం ఏరియాలో 300లకుపైగా థియేటర్లలో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఒక్క హైదరాబాద్‌లోనే ఈచిత్రం 100కు పైగా థియేటర్లలో విడుదల చేయడానికి ఏర్పాట్లు చేసారు. ఎన్టీఆర్ స్టార్ ఇమేజ్‌కు తోడు శ్రీను వైట్ల దర్శకత్వం కావడంతో సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి.

    'బాద్ షా' చిత్రాన్ని బండ్ల గణేష్ పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్ సరసన కాజల్ అగర్వాల్ నటిస్తోంది. తమన్ సంగీతం అందిస్తున్నారు. దర్శకుడు శ్రీను వైట్ల 'బాద్ షా' చిత్రాన్ని ఫుల్లీలోడెడ్ ఎంటర్ టైన్మెంట్స్ ఎలిమెంట్స్ తో రూపొందిస్తున్నారు. ఏప్రిల్ 5వ తేదీ ఉదయం 5.09 గంటలకు సినిమాను ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేన్నారు. ఈ చిత్రానికి థమన్, కె.వి.గుహన్, గోపీమోహన్, కోనవెంకట్, ఎ.ఎస్.ప్రకాష్, ఎంఆర్ వర్మ, చలసాని రామారావు సాంకేతిక వర్గం. సమర్పణ: శివబాబు బండ్ల, నిర్మాత: బండ్ల గణేష్, స్క్రీన్ ప్లే-దర్శకత్వం: శ్రీను వైట్ల.

    English summary
    Dil Raju bagged ‘Badshah’ Nizam Rights for Rs 10crs on recoverable advance basis. Baadshah is an upcoming Telugu action film directed by Srinu Vaitla. The film is produced by Bandla Ganesh under his Parameshwara Art Productions banner. It stars Jr. NTR and Kajal Aggarwal in the lead roles.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X