For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    గోపాల గోపాల: రంగంలోకి దిల్ రాజు, జనవరి 1నే...

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, విక్టరీ వెంకటేష్ మల్టీ స్టారర్‌గా నటించిన ‘గోపాల గోపాల' చిత్రం ఆడియో విడుదల జనవరి 3న అనే వార్తలు వినిపించినప్పటికీ తాజాగా జనవరి 1నే రిలీజ్ చేస్తారని అంటున్నారు. సినిమాలో ఉన్నది కేవలం 3 పాటలే కావడంతో సింపుల్‌గా ఆడియో వేడుక చేందుకు ప్లాన్ చేస్తున్నారు.

    ఇక ఈ చిత్రం నైజాం రైట్స్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు దక్కించుకున్నారు. ఎన్ఆర్ఏ బేసిస్ కింద రూ. 13.4 కోట్లకు ఆయన ఈ చిత్రాన్ని దక్కించుకున్నట్లు తెలుస్తోంది. జనవరి 14న సంక్రాంతి సందర్భంగా సినిమాను భారీ ఎత్తున విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. బాలీవుడ్‌లో ఘనవిజయం సాధించిన 'ఓ మై గాడ్‌' చిత్రానికి రీమేక్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి కిషోర్‌కుమార్‌ పార్థసాని(డాలీ) దర్శకత్వం వహిస్తున్నారు.

    Dil Raju bags Gopal Gopala Nizam rights

    అనూప్‌ రూబెన్స్‌ స్వరాలందిస్తున్నారు. శ్రియ హీరోయిన్. సురేష్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై సురేష్‌బాబు, శరత్‌మరార్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేవుడంటే నమ్మకం లేని వ్యక్తి(వెంకటేష్) దుకాణం నడుపుతంటాడు. అందులో అమ్మేవేమిటో తెలుసా? దేవుడి బొమ్మలే! మాట్లాడితే దేవుడి అస్థిత్వాన్ని ప్రశ్నిస్తుంటాడు. అలాంటిది అతడి దుకాణం భూకంపం దాటికి నేలకూలియింది. అప్పుడు అతడేం చేశాడు? అనే అంశం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం 'గోపాల గోపాల'. వెంకటేష్‌, పవన్‌ కల్యాణ్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. వెంకటేష్‌ సరసన శ్రియ నటిస్తోంది.

    English summary
    Producer and distributor Dil Raju, has bagged the Nizam area distribution rights of the most awaited multi-starrer ‘Gopala Gopala’. He has bought the rights for a whopping 13.4 Crores on NRA basis.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X