బరువైన హృదయంతో బయటకు వస్తారు: మహేష్ బాబు ‘మహర్షి’పై దిల్ రాజు
Recommended Video

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'మహర్షి'. దిల్ రాజు, అశ్వినీ దత్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దిల్ రాజు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
మహేష్ బాబు కెరీర్లో ఇది 25వ చిత్రం. కేవలం ల్యాండ్ మార్క్ మూవీ అయినంత మాత్రాన ఏ సినిమా ఆడదు.. కథ బావుంటే ఆడుతుంది. 'మహర్షి' బాక్సాఫీసు వద్ద మ్యాజిక్ చేస్తుందని నేను కచ్చితంగా చెప్పగలను. దర్శకుడు వంశీ స్క్రిప్టు రాసుకున్న విధానం, మహేష్ బాబు క్యారెక్టర్ డిజైన్ చేసిన తీరు చాలా బావుంటుందని దిల్ రాజు తెలిపారు.

బరువైన హృదయంతో బయటకు వస్తారు
‘మహర్షి' సినిమా చూసిన ప్రతి ప్రేక్షకుడు షో పూర్తయి బయటకు వచ్చేపుడు ఒక బరువైన హృదయంతో వస్తారు. అదేమిటనేది సినిమాలో చూస్తారు. ఆ పాయింట్ నేను ఇప్పుడే బయటకు చెప్పలేను అని దిల్ రాజు వ్యాఖ్యానించారు.

ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది
కథ మహేష్ బాబు పర్సనల్ లైఫ్ నుంచి కనెక్ట్ అయ్యే విధంగా ఉంటుంది. ఫ్రెండ్షిప్‌లో ఉండే ఎమోషన్. ఫాదర్, మదర్ తో ఉండే ఎమోషన్.. ఫైనల్‌గా సొసైటీకి మనం ఎంత అవసరం? అనే పాయింట్ ఆసక్తికరంగా ఉంటుంది. రాజకీయాలకు సంబంధం లేని సినిమా ఇది. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ఫీయ్యే విధంగా కథ ఉంటుందని తెలిపారు.

అందుకే ‘మహర్షి' అనే టైటిల్
సొసైటీలో ‘మహర్షి' అని ఎవరిని అంటాం? ఏదైనా సాధించిన వారిని అంటాం.. ఒక మామూలు వ్యక్తి ‘మహర్షి'గా మారితే ఎలా ఉంటుంది అనే పాయింట్ అభిమానులను ఆకట్టుకుంటుంది. ఏప్రిల్ 25న రిలీజ్ ప్లాన్ చేస్తున్నాం. త్వరలోనే ప్రమోషన్స్ మొదలు పెడతామన్నారు.

మహర్షి
‘మహర్షి'లో మహేష్ సరసన పూజా హెగ్డే నటిస్తుండగా... అల్లరి నరేష్ స్నేహితుడి పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటి వరకు వచ్చిన సూపర్ స్టార్ సినిమాలన్నింటికంటే బెస్ట్ సబ్జెక్ట్‌తో ఈ చిత్రం రూపొందుతోంది. సోనాల్ చౌహాన్, జగపతి బాబు, సాయి కుమార్, ప్రకాష్ రాజ్, నరేష్, జయసుధ, పోసాని కృష్ణ మురళి ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.


Click it and Unblock the Notifications











