హీరోగా దిల్ రాజు వారసుడు.. సొంత కొడుకు కాదు.. కానీ అంతకంటే ఎక్కువ!
సినిమా ఇండస్ట్రీలో నటీనటులు ఫ్యామిలీ నుంచి వారసులు ఎంట్రీ ఇవ్వడం కామన్. ఇక టెక్నీషియన్స్ ఫ్యామిలీ నుంచి కూడా నటవారసులు చాలా మంది వస్తుంటారు. ఇక వారి సినిమాలపై ఎంత శ్రద్ధ తీసుకుంటారో తెలియదు గాని నిర్మాతలు మాత్రం వారి ఇంటి నుంచి వచ్చే వారసుల కోసం అందరికంటే ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటారు. ఇక బడా నిర్మాతల కొడుకుల ఎంట్రీ గురించి స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్స్ లో ఒకరైన దిల్ రాజు వారసుడు కూడా త్వరలోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతున్నాడు.

ఆ సినిమాతో యూ టర్న్..
మొదట్లో డిస్ట్రిబ్యూటర్ గా కెరీర్ ను స్టార్ట్ చేసిన దిల్ రాజు తమిళ్ భారతీయుడు సినిమాను తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేసినప్పుడు భారీ స్థాయిలో లాభాలను అందుకున్నాడు. ఆ సినిమా తరువాత ఏ సినిమా విడుదల చేసిన కూడా పెట్టిన పెట్టుబడికి డబుల్ ప్రాఫిట్స్ అందాయి. అందుకే దిల్ రాజు శంకర్ తో చాలా సన్నిహితంగా ఉంటాడు.

ఎంతోమందిని పరిచయం చేసిన దిల్ రాజు
దిల్ సినిమాతో నిర్మాతగా మొదలైన రాజు గారి సక్సెస్ ఆ తరువాత అంతకంతకు పెరుగుతూ వచ్చింది. ఇక ఆయన సినిమా జర్నీలో ఎంతో మంది నటీనటులు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. కొత్త కొత్త దర్శకులకు అవకాశాలు ఇచ్చారు. ఇప్పుడున్న టాప్ దర్శకుల్లో కొందరు దిల్ రాజు ప్రొడక్షన్ నుంచి వచ్చినవారే.

వారసుడి ఎంట్రీ..
ఎన్నో బాక్సాఫీస్ హిట్స్ అందుకున్న దిల్ రాజు ఇక తన వారసుడిని కూడా ఇండస్ట్రీలోకి తీసుకురాబోతున్నాడు. సాధారణంగా కొత్త హీరోతో సినిమా చేస్తేనే ఎన్నో రకాలుగా ఆలోచించే దిల్ రాజు తన ఇంటి నుంచి రాబోయే హీరో కోసం ఇంకా ఏ రేంజ్ లో ఆలోచించి ఉంటాడో స్పెషల్ గా చెప్పనవసరం లేదనే ఆలోచన రాకుండా ఉండదు. అయితే దిల్ రాజు మాత్రం పెద్దగా హడావుడి లేకుండా కొడుకును వెండితెరకు పరిచయం చేస్తున్నాడు.

సొంత కొడుకు కాదు.
ఇక ఆ వారసుడి పేరు ఆశిష్ రెడ్డి. ఈ కుర్రాడు రాజు గారి సొంత కొడుకు కాదు. అబతకంటే ఎక్కువ. అతని సోదరుడు అయిన శిరీష్ తనయుడు ఆశిష్ అంటే దిల్ రాజుకు చాలా ఇష్టం . ఇక శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ లో మొదటి నుంచి కూడా దిల్ రాజు తరువాత అంత కీలకమై వ్యక్తి శిరీష్. దిల్ రాజు ఒక్కసారి సినిమా కథను ఒకే చేస్తే ఆ ప్రాజెక్ట్ పూర్తయ్యే వరకు కూడా ప్రొడక్షన్ పనులన్నింటిని శిరీష్ చూసుకుంటూ ఉంటారు.

పెద్ద టెక్నీషియన్స్ తో..
ఇక శిరీష్ తనయుడు మొదటి సినిమా ఆశిష్ సినిమాను మీడియం బడ్జెట్ తోనే ప్లాన్ చేస్తున్నారు. హుషారు సినిమాతో మంచి గుర్తింపు అందుకున్న దర్శకుడు శ్రీ హర్ష శిరీష్ మొదటి సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. ఇక టెక్నీషియన్స్ విషయంలో దిల్ రాజు పెద్దవారినే సెట్ చేశాడు. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ అందిస్తుండగా శ్రీమంతుడు, సాహో లాంటి సినిమాలకు వర్క్ చేసిన మధి సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు. మరి మొదటి సినిమాతో ఆశిష్ ఎలాంటి హిట్ అందుకుంటాడో చూడాలి.


Click it and Unblock the Notifications











