Marriage: సైలెంటుగా ఎంగేజ్మెంట్ చేసుకున్న యంగ్ హీరో.. వధువు ఎవరో తెలుసా?

సినిమా ఇండస్ట్రీలో సెలబ్రెటీలు చాలా మంది పెళ్లీ పీటలు ఎక్కుతున్నారు. మొన్నటి వరకు నాగబాబు కొడుకు వరుణ్ తేజ్.. లావణ్యను పెళ్లి చేసుకుని వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు. ఇక బాలీవుడ్, కోలీవుడ్, బుల్లితెర సెలబ్రేటీలు అందరూ పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. అయితే ఇప్పుడు ఓ కుర్ర హీరో.. సైలెంటుగా ఎంగేజ్మెంట్ జరుపుకుని షాక్ ఇచ్చాడు. ఆ హీరో ఎవరు.. ఏంటి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

మొన్నటి వరకు వరుణ్ తేజ్, లావణ్య పెళ్లి సందడి టాలీవుడ్ లో నెలకొంది. ఇక వారి పెళ్లి తర్వాత అర్జున్ సర్జా కూతురు పెళ్లి, అటు రాధ కూతురు కార్తిక పెళ్లి.. ఇటు బాలీవుడ్ లోనూ చాలా మంది సెలబ్రెటీలు పెళ్లి పీటలు ఎక్కారు. ఇక టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ అంతా పెళ్లి సందడి మొదలైంది. ఇప్పుడు టాలీవుడ్ లో మరో యంగ్ హీరో సైలెంటుగా పెళ్లీ పీటలు ఎక్కబోతున్నాడు. ఆ హీరో ఎవరో కాదు దిల్ రాజు వారసుడు.

Dil Raju Brother Sirish Son Ashish Engagement With Advitha Reddy Photos Viral

దిల్ రాజు ఇంట్లో పెళ్లి సంబరాలు మొదలు అయ్యాయి. దిల్ రాజు సోదరుడు శిరీష్ అందరికి తెలిసే ఉంటుంది. ఆయన కొడుకు ఆశిష్ ఎంగేజ్మెంట్ గురవారం వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకకు టాలీవుడ్ సెలెబ్రిటీలను ఎక్కువగా పిలిచినట్టుగా లేరు. ఎందుకో తెలియదు కానీ చాలా సీక్రెట్ గా సైలెంటుగా ఈ వేడుకను జరుపుకున్నారు. ఆశీష్ ఎంగేజ్మెంట్ సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగిందని తెలుస్తోంది.

దిల్ రాజు వారసుడుగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆశిష్ రెడ్డి త్వరలోనే ఓ ఇంటివాడు కానున్నాడని ఎప్పటి నుంచో వార్తలు వచ్చాయి. ఇక ఆ వార్తలను నిజం చేస్తూ.. ఎంగేజ్మెంట్ జరుపుకున్నాడు. ఆశీష్ రెడ్డి... అద్వైత రెడ్డి అనే అమ్మాయిని ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. వీరి ఫోటోలు, వీడియోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి. వీరి ఎంగేజ్మెంట్ హాట్ టాపిక్ అవుతుంది.

Dil Raju Brother Sirish Son Ashish Engagement With Advitha Reddy Photos Viral

ఇక ఆశీష్ విషయానికి వస్తే... రౌడీ బాయ్స్ అంటూ తెలుగులో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా సంక్రాంతి రేసులో వచ్చి బాక్సాఫీస్ వద్ద పరాజయం పొందింది. మలయాళ ముద్దుగుమ్మ అనుపమతో మాత్రం లిప్ లాక్ సీన్లలో నటించి బాగానే ఫేమస్ అయ్యాడు ఈ హీరో. మొదటి చిత్రం రౌడీ బాయ్స్ ఆకట్టుకోలేకపోయినా... ఇక రెండో చిత్రం సెల్ఫీష్ అంటూ ముందుకు రాబోతున్నాడు.

ఇక ఆశీష్ సెల్ఫీష్ సినిమా వచ్చే ఏడాది రిలిజ్ కానుందని తెలుస్తోంది. ఇక అద్వైత రెడ్డి విషయానికి వస్తే... ఆంధ్రాకు చెందిన బిజినెస్ మెన్ ఫ్యామిలీకి చెందినది అని సమాచారం. మొత్తానికి ఆశిష్ మాత్రం ఆంధ్రాకు అల్లుడయ్యాడని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక వీరిద్దరి వివాహాం వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరుగుతుందని టాలీవుడ్ వర్గాల సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X