దిల్ రాజు సినిమా కాబట్టి జనాలు చూస్తారనే నమ్మకం...!
హైదరాబాద్: 'ఋషి' ఫేం అరవింద్ కృష్ణ హీరోగా మీనాక్షి దీక్షిత్, పూజరామచంద్రన్ హీరోయిన్స్‌గా మూన్ లైట్ డ్రీమ్స్ పతాకంపై అక్కి విశ్వనాథరెడ్డి స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం 'అడవి కాచిన వెన్నెల' అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నైజాం, వైజాగ్ ఏరియాలలో రిలీజ్ చేస్తున్నారు.
ఈ సందర్భంగా దర్వక నిర్మాత అక్కి విశ్వనాథరెడ్డి మాట్లాడుతూ...'మా అడవికాచిన వెన్నెల' చిత్రాన్ని నైజాం, వైజాగ్‌లలో దిల్ రాజు గారు రిలీజ్ చేస్తున్నారు. చిన్న సినిమాల్లో మంచి సినిమాగా ఇండస్ట్రీలో ఆల్ రెడీ టాక్ రావడంతో మిగతా ఏరియాల నుండి కూడా పెద్ద డిస్ట్రిబ్యూటర్స్ మా చిత్రాన్ని రిలీజ్ చేస్తామని ముందుకొస్తున్నారు.

రెగ్యులర్ చిత్రాలకు భిన్నంగా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రూపొందించిన ఈ చిత్రాన్ని చూసి ప్రతి ఒక్కరూ థ్రిల్ అవుతారు. మా చిత్రాన్ని దిల్‌రాజుగారు రిలీజ్ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా వుంది. దీంతో మా చిత్రానికి మరింత క్రేజ్ వచ్చింది. తప్పకుండా ఈ చిత్రం పెద్ద హిట్ అవుతుందన్న నమ్మకం నాకు వుంది' అని అన్నారు.
అరవింద్‌కృష్ణ, మీనాక్షిదీక్షిత్, పూజరామచంద్రన్, రుషి, వినోద్‌కుమార్, సురేష్, తాగుబోతు రమేష్, చిత్రం శ్రీను, జోగి బ్రదర్స్, పృధ్వి, ప్రవీణ్, కళ్ళు క్రిష్ణారావు తదితరులు నటించిన ఈ చిత్రానికి ఎడిటింగ్: మార్తాండ్ కె.వెంకటేష్, పాటలు: సిరివెన్నెల సీతారామశాస్త్రి, సంగీతం: కార్తీక్ రోడ్రిగ్విజ్, జోస్యభట్ల, ఫైట్స్: వెంకట్, కొరియోగ్రఫి: శివశంకర్, సురేష్‌వర్మ, విఎఫ్‌ఎక్స్ అండ్ పబ్లిసిటీ డిజైన్స్: జి.ఎస్.ఎస్.పి. కళ్యాణ్, రచన-దర్శకత్వం- నిర్మాత: అక్కి


Click it and Unblock the Notifications











