సొంత ఊళ్లో దిల్ రాజు సంక్రాంతి సంబరాలు
హైదరాబాద్ : ప్రముఖ సినీనిర్మాత దిల్‌రాజు తన కుటుంబ సభ్యులతో కలిసి తన స్వగ్రామమైన నిజామాబాద్ నర్సింగ్‌పల్లిలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుపుకొన్నారు. మాపల్లె ఛారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో గ్రామ పరిసరాల్లో నిర్మిస్తున్న ఇందూర్ తిరుమల ఆలయ ప్రాంగణంలో ఈ సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు, చిన్నారులకు ముగ్గుల పోటీలు, గాలిపటాలు, గొబ్బెమ్మలు, భోగిమంటలు నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ క్రిస్టినా, ఎమ్మెల్సీలు నర్సారెడ్డి, రాజేశ్వర్, ఎమ్మెల్యే మండవ వెంకటేశ్వరరావు, ప్రముఖ సినీ రచయిత భారవి, ఛారిటబుల్ ట్రస్టు వ్యవస్థాపకులు నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
దిల్ రాజు తన తాజా చిత్రం "సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రం విజయంతో చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఈ చిత్రం సక్సస్ ని ఆయన ఎంజాయ్ చేస్తున్నట్లు మీడియాతో తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. సినిమాకు వస్తున్న స్పందన అమోఘం. సినిమా చూసి జర్నలిస్టులు ఫోన్‌లు చేస్తుంటే కన్నీటిపొర ఆగలేదు. ఏడాది పాటు నేను పడ్డ కష్టాన్నంతా మర్చిపోయాను అని దిల్‌రాజు అన్నారు.
వెంకటేష్, మహేష్ కలిసి నటించిన మల్టీస్టారర్ చిత్రం 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' శుక్రవారం విడుదలైంది. శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించిన ఈ సినిమా గురించి ఆ చిత్ర నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ... మహేష్, వెంకటేష్ ఫ్యాన్స్ చాలా హ్యాపీగా ఉన్నారు. తెరపై హీరోలను చూడటం మర్చిపోయామని, పూర్తిగా అన్నదమ్ములను చూసిన భావనలో ఉండిపోయామని అంటుంటే ఆనందంగా అనిపించింది. నా కాళ్ళకు దణ్ణం పెట్టాలనిపిస్తుందని కొందరు ఫోన్లు చేశారు అన్నారు.


Click it and Unblock the Notifications











