ఎన్టీఆర్ చిత్రం గురించి దిల్ రాజు వివరణ
హైదరాబాద్ : ఎన్టీఆర్ హీరోగా, హరీష్ శంకర్ దర్శకత్వంలో 'ఎమ్.ఎల్.ఎ.' అనే చిత్రం మొదలు కాబోతోందని కొద్ది నెలలుగా ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే. 'మంచి లక్షణాలున్న అబ్బాయి' అనేది ట్యాగ్ లైన్ అని కూడా చెప్పారు. అయితే ఎన్టీఆర్ తదుపరి నటించబోయే చిత్రం 'ఎమ్.ఎల్.ఎ.' కాదు. దిల్ రాజు నిర్మించే చిత్రంలో నటిస్తారు. ఈ విషయమై దిల్ రాజు తాజాగా మీడియాకు వివరణ ఇచ్చారు. ఈ సినిమా దసరా పర్వదినాల్లో ప్రారంభమవుతుంది.
దిల్ రాజు మాట్లాడుతూ ''ఎన్టీఆర్ చిత్రానికి సంబంధించిన స్టోరీ డిస్కషన్స్ పూర్తయ్యాయి. మేం తీసే చిత్రం టైటిల్ 'ఎమ్.ఎల్.ఎ.' అని ప్రచారంలో ఉంది. అందులో నిజం లేదు. మేం ఎంచుకొన్న కథలో రాజకీయాంశాలు లేవు. పక్కా వాణిజ్య విలువలతో ఉంటుందా చిత్రం'' అన్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కొద్ది రోజుల్లో తెలుస్తాయి.
ఎన్టీఆర్ బాడీ లాంగ్వేజ్, ఇమేజ్‌కు సరిపోయే ఓ విభిన్నమైన మాస్ ఎంటర్‌టైనర్ కథను హరీష్ సిద్ధం చేశాడని చెప్తున్నారు. ఇటీవల ఈ కథను విన్న ఎన్టీఆర్ ఈ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలిసింది. ముఖ్యంగా మాస్ కి నచ్చే ఎలిమెంట్స్ అన్ని హరీష్ కూర్చి ఈ కథను జన రంజకంగా తెరకెక్కించనున్నాడని టాక్. చిత్ర దర్శకుడు హరీష్ శంకర్ ఈ చిత్రం స్క్రీన్ ప్లే ఇప్పటికీ పూర్తి చేసారు. పూర్తి స్ధాయి ఎంటర్టైనర్ గా ఈ చిత్రం తెరకెక్కనుంది. గతంలో దిల్ రాజు,ఎన్టీఆర్ కాంబినేషన్ లో బృందావనం చిత్రం వచ్చి విజయవంతమైన సంగతి తెలిసిందే.
అలాగే ఎన్టీఆర్ ఈ చిత్రం విషయమై దర్శకుడు హరీష్ శంకర్ కి డేట్స్ విషయమై క్లారిటీ ఇచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం తాను చేస్తున్న బాద్షా చిత్రం పూర్తయ్యేదాకా మరో చిత్రం చేయనని చెప్పినట్లు సమాచారం. డిసెంబర్ నుంచి కంటిన్యూ డేట్స్ ఇస్తానని,అప్పటికి స్క్రిప్టు పూర్తి చేసుకోమని హరీష్ కి చెప్పినట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. దిల్ రాజు నిర్మించే ఈ చిత్రం పక్కా మాస్ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది. ప్రస్తుతం ఎన్టీఆర్-శ్రీనువైట్ల కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న 'బాద్‌షా' చిత్రం రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. శ్రీను వైట్ల పుట్టిన రోజు సందర్భంగా బాద్షా టీజర్ విడుదల చేసారు. ఈ టీజర్ అన్ని వర్గాలను ఆకట్టుకుంది.


Click it and Unblock the Notifications











